Home > తెలంగాణ > హైదరాబాదీలకు మరో గుడ్ న్యూస్..సాగర్ ఒడ్డున పర్యాటక ప్రాంతం

హైదరాబాదీలకు మరో గుడ్ న్యూస్..సాగర్ ఒడ్డున పర్యాటక ప్రాంతం

హైదరాబాదీలకు మరో గుడ్ న్యూస్..సాగర్ ఒడ్డున పర్యాటక ప్రాంతం
X

దేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న నగరాల్లో ఒకటైన హైదరాబాద్‌ రూపు రేఖలు మెళ్లి మెళ్లిగా మారిపోతున్నాయి. అత్యాధునిక హంగులతో వినూత్నమైన కట్టడాలతో భాగ్యనగరం సుందరమయంగా మారుతోంది. పురపాలక శాఖ ఆధ్వర్యంలో హెచ్ఎండీఏ, జీహెచ్‌ఎంసీ సంయుక్తంగా నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో పార్కులు, అర్బన్ ఫారెస్ట్‌లు, వాకింగ్‌ ట్రాక్‌లను అభివృద్ధి చేస్తున్నాయి. తాజాగా మరో మణిహారం హైదరాబాద్‌‎కు రాబోతుంది. హుస్సేన్ సాగర్ ఒడ్డున సుందరమైన పర్యాటక ప్రాంతం నగరవాసులకు త్వరలో అందుబాటులోకి రాబోతోంది. రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ విషయాన్ని తాజాగా ప్రకటించారు. తన ట్విటర్ అకౌంట్ ద్వారా లేక్ వ్యూ ఫోటోలను, వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియో నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ జలవిహార్‌‌ పక్కనే ఉన్న 10 ఎకరాల్లో సుందరమైన లేక్ ఫ్రంట్ పార్క్‎ను అభివృద్ధి చేసింది. ఈ లేక్ ఫ్రంట్ పార్క్ మరికొన్ని రోజుల్లోనే నగరవాసులకు అందుబాటులోకి రానుంది. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన పార్క్ వీడియోతో పాటు ఫొటోలను తన ట్విట్టర్‌‌లో మంత్రి కేటీఆర్ షేర్ చేశారు. హెచ్ఎండీఏ పనితీరును మినిస్టర్ మెచ్చుకున్నారు. ప్రతి ఒక్కరూ ఈ పార్క్‌ను సందర్శించాలని, స్పెషల్ అట్రాక్షన్‎గా నిలవనున్న బోర్డ్‌వాక్‌ను ఆస్వాదించాలని మంత్రి అన్నారు. ప్రస్తుతం ఈ పార్క్ ఫోటోలు, వీడియో నగరవాసులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. త్వరలోనే మినిస్టర్ ఈ పార్క్‎ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.

Updated : 19 Sep 2023 12:26 PM GMT
Tags:    
Next Story
Share it
Top