Home > తెలంగాణ > కేసీఆర్కు అమిత్ షా సవాల్.. బీఆర్ఎస్ గెలిస్తే అలా చేస్తారా..

కేసీఆర్కు అమిత్ షా సవాల్.. బీఆర్ఎస్ గెలిస్తే అలా చేస్తారా..

కేసీఆర్కు అమిత్ షా సవాల్.. బీఆర్ఎస్ గెలిస్తే అలా చేస్తారా..
X

తెలంగాణలో కుటుంబ పార్టీలను తరిమేసి బీజేపీని గెలిపించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోరారు. కేటీఆర్ను సీఎం చేయడం కేసీఆర్ లక్ష్యమని.. రాహుల్ను పీఎం చేయడం సోనియా లక్ష్యమని.. కానీ అభివృద్ధి చేయడమే బీజేపీ లక్ష్యమన్నారు. సూర్యాపేట జనగర్జన సభలో షా ప్రసంగించారు. బీజేపీని గెలిపిస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం.. బీఆర్ఎస్ గెలిస్తే దళితుడిని సీఎం చేస్తారా అని అమిత్ షా ప్రశ్నించారు. కేసీఆర్కు దమ్ముంటే తన ప్రశ్నకు సమాధానం చెప్పాలన్నారు. దళితులకు కేసీఆర్ ఇస్తానన్న మూడెకరాలు ఏమయ్యాయని ప్రశ్నించారు.

బీఆర్ఎస్ దళిత, బీసీ వ్యతిరేక పార్టీ అని అమిత్ షా విమర్శించారు. తెలంగాణలో సమగ్ర అభివృద్ధి జరగాలంటే బీజేపీని గెలిపించాలని కోరారు. బీసీల సంక్షేమాన్ని కేసీఆర్ ఎందుకు వదిలేశారని నిలదీశారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద రాష్ట్రంలో 40లక్షల మంది రైతులకు 9వేల కోట్ల రూపాయలు అందిస్తున్నట్లు చెప్పారు. జల్ జీవన్ మిషన్ కింద పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నట్లు వివరించారు. తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ, పసుపు బోర్డు ఇచ్చిన ఘనత తమకే దక్కుతుందని.. రాష్ట్రంలోనూ గెలిపిస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.


Updated : 27 Oct 2023 12:36 PM GMT
Tags:    
Next Story
Share it
Top