Home > తెలంగాణ > 27న రాష్ట్రానికి అమిత్ షా.. సూర్యాపేటలో భారీ బహిరంగ సభ

27న రాష్ట్రానికి అమిత్ షా.. సూర్యాపేటలో భారీ బహిరంగ సభ

27న రాష్ట్రానికి అమిత్ షా.. సూర్యాపేటలో భారీ బహిరంగ సభ
X

పోలింగ్కు సమయం దగ్గరపడుతుండటంతో బీజేపీ దూకుడు పెంచింది. పార్టీ అగ్రనేతలతో ప్రచారానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే త్వరలోనే జాతీయ స్థాయి నాయకులు తెలంగాణలో పర్యటించనున్నారు. క్యాంపెయినింగ్పై స్పెషల్ ఫోకస్ పెట్టిన బీజేపీ 119 నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 27న రాష్ట్రానికి రానున్నారు. సూర్యాపేటలో జరగనున్న ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొంటారు. తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యాక అమిత్ షా రాష్ట్రానికి రావడం ఇది రెండో సారి. అంతకుముందు రాష్ట్రానికి వచ్చిన ఆయన అదిలాబాద్లో ప్రచారం నిర్వహించారు.

ఈ నెల 28,29 తేదీల్లో అసోం సీఎం హేమంత్ బిశ్వ శర్మ రాష్ట్రానికి రానున్నారు. 31న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సైతం రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నట్లు సమాచారం. వీరితో పాటు ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రంలో 5 నుంచి 10 సభల్లో పాల్గొనే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇంకా షెడ్యూల్ ఖరారు కాలేదు. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్తో పాటు పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు సైతం ప్రచారంలో పాల్గొనేలా బీజేపీ ప్లాన్ సిద్ధం చేసినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే బహిరంగ సభలతో పాటు ఇంటింటి ప్రచారాన్ని ఉద్ధృతం చేయాలని బీజేపీ నిర్ణయించింది. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నిధుల గురించి ప్రజలకుఅవగాహన కల్పించాలని పార్టీ హైకమాండ్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో క్షేత్రస్తాయిలో కార్యకర్తల నుంచి డోర్ టూ డోర్ క్యాంపెయిన్ నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమైంది.




Updated : 24 Oct 2023 11:26 AM GMT
Tags:    
Next Story
Share it
Top