Home > తెలంగాణ > మహిళల వస్త్రధారణపై హోంమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

మహిళల వస్త్రధారణపై హోంమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

మహిళల వస్త్రధారణపై హోంమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
X

మహిళల వస్త్రాధారణపై రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో తలెత్తిన హిజాబ్ వివాదంపై స్పందించిన ఆయన మహిళలు పొట్టి దుస్తులు ధరించడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. ఎవరి ఆహార్యాన్నైనా గౌరవించాల్సిందేనన్న ఆయన.. తలనుంచి పాదాల వరకు కప్పి ఉంచే దుస్తుల విషయంలో గొడవ సరికాదని అన్నారు. అమ్మాయిలు దుస్తులు వేసుకుంటే సమస్య కాదు.. పొట్టి దుస్తులు వేసుకోవడంతోనే సమస్య అంటూ మహమూద్ అలీ చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి.

శుక్రవారం ఐఎస్ సదన్లోని కేవీ రంగారెడ్డి కాలేజీలో పరీక్ష రాసేందుకు కొందరు ముస్లిం విద్యార్థినిలు వెళ్లారు. అయితే వారంతా హిజాబ్ ధరించి ఉండటంతో కాలేజ్ మేనేజ్ మెంట్ వారిని ఎగ్జామ్ రాసేందుకు అనుమతించలేదు. దీంతో విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యం మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. హిజాబ్ వేసుకొని వస్తే ఎట్టిపరిస్థితుల్లో పరీక్ష రాసేందుకు అనుమతించమని తేల్చి చెప్పడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో విద్యార్థినిలు హిజాబ్ తీసేసి పరీక్ష రాశారు. ఎగ్జామ్ పూర్తైన తర్వాత ఈ విషయాన్ని విద్యార్థినిలు, వారి తల్లిదండ్రులు మంత్రి మహమూద్ అలీ దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా ఈ వివాదంపై స్పందించిన మంత్రి మహమూద్ అలీ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

మహమూద్ అలీ వ్యాఖ్యలపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ వస్త్రధారణ గురించి అలా మాట్లాడటం సరికాదని అంటున్నారు. బాధ్యతయుతమైన పదవిలో ఉండి పొట్టి బట్టలు వేసుకోవద్దంటూ హోం మంత్రి చెప్పడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Updated : 17 Jun 2023 12:59 PM IST
Tags:    
Next Story
Share it
Top