Home > తెలంగాణ > వేములవాడ, భద్రాద్రి ఆలయాలకు పోటెత్తిన భక్తులు

వేములవాడ, భద్రాద్రి ఆలయాలకు పోటెత్తిన భక్తులు

వేములవాడ, భద్రాద్రి ఆలయాలకు పోటెత్తిన భక్తులు
X

వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు రావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. కూలైన్లన్నీ కిక్కిరిపోవడంతో స్వామివారి దర్శనానికి 5 గంటల

సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు గర్భాలయంలో ఆర్జిత సేవలను రద్దుచేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు. సమక్క సారక్క జాతకు వెళ్లే భక్తులు వేములవాడ రాజన్నను దర్శించుకోవడం అనవాయితీగా వస్తోంది. దీంతో గత కొన్ని రోజులుగా రాజన్న ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది.

అటు భద్రాచలం ఆలయం కూడా భక్తులతో కిక్కిరిపోయింది. వరుస సెలవులు రావడంతో శ్రీరాముని దర్శనానికి భక్తులు పోటెత్తారు. అన్ని క్యూలైన్లు భక్తులతో నిండిపోవడంతో స్వామి వారి దర్శనానికి భారీ టైం పడుతోంది. కాగా ఆలయంలో వైకుంఠ ఏకాదశీ అధ్యయనోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామి వారు ముత్తంగి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆదివారం రామయ్యను 17,500మంది దర్శించుకున్నారు.

Updated : 25 Dec 2023 11:07 AM IST
Tags:    
Next Story
Share it
Top