అంకుర ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం..
Krishna | 23 Dec 2023 6:35 PM IST
X
X
హైదరాబాద్ గుడిమల్కాపూర్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అంకుర ఆస్పత్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆస్పత్రిలోని 3,4,5 అంతస్థుల్లో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. 4 ఫైర్ ఇంజిన్లతో ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. మరోవైపు పేషెంట్లను రక్షించేందుకు రెస్క్యూ కొనసాగుతోంది. ఆస్పత్రిలో గర్బిణీలు, చిన్నపిల్లలు ఉన్నారు. వారిని రక్షించేందుకు పోలీసులు, ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందన్నదానిపై క్లారిటీ లేదు.
Updated : 23 Dec 2023 6:36 PM IST
Tags: ankura hospital ankura hospital fire accident gudimalkapur fire accident hyderabad fire accident fire accident in hospital hyderabad police
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire