ఇలా ఉన్నావేంట్రా.. ఎక్కడా ప్లేస్ లేనట్లు అక్కడ దాచావ్..
X
శంషాబాద్ ఎయిర్ పోర్టులో అక్రమ బంగారం పట్టుబడుతూనే ఉంది. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా విదేశాల నుంచి అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. ఈ అక్రమ రవాణాలో కేటుగాళ్ల తెలివికి అధికారులే అవాక్కవుతున్నారు. అయితే వాళ్లు ఎన్ని ఎత్తులు వేస్తున్నా అధికారులు వాటికి పైఎత్తులు వేసి చిత్తు చేస్తున్నారు. తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. అయితే అతడు తరలిస్తున్న విధానం చూసి అధికారులే షాక్ అయ్యారు.
ఇండిగో విమానంలో జెడ్డా నుంచి హైదరాబాద్కు ఓ వ్యక్తి వచ్చాడు. అతడి ప్రవర్తనపై అనుమానం రావడంతో అధికారులు క్షున్నంగా తనిఖీలు చేశారు. ఈ క్రమంలో అతడి శరీరంలోని మలద్వారంలో బంగారం ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆస్పత్రికి తరలించి అతడికి ఆపరేషన్ నిర్వహించారు. మొత్తం 785 గ్రాముల బంగారాన్ని అతని శరీరంలోని నుంచి తీశారు. ఈ బంగారం విలువ 47.49లక్షలు ఉంటుందని అధికారులు చెప్పారు.
నిందితుడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. బంగారం ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు.. వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా గత పది రోజుల క్రితం కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఓ వ్యక్తి వద్ద నుంచి 510 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.