Home > తెలంగాణ > 2లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ఎప్పుడు : కౌశిక్ రెడ్డి

2లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ఎప్పుడు : కౌశిక్ రెడ్డి

2లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ఎప్పుడు : కౌశిక్ రెడ్డి
X

కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అబద్ధపు పునాదులపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని ఆరోపించారు. పదేళ్లలో బీఆర్ఎస్ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని కాంగ్రెస్ నేతలు చెప్పడం సిగ్గుచేటన్నారు. తాము ఉద్యోగాలు ఇవ్వనిదే.. లక్షా 60వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారా అని ప్రశ్నించారు. రేవంత్, కోదండరాం అబద్ధాలు ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఎన్నికలకు కొన్ని నెలల ముందు.. 42వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయగా.. ప్రస్తుతం అవి వివిధ దశల్లో ఉన్నాయన్నారు. వెంటనే వాటిపై దృష్టి సారించాలని సూచించారు.

ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా 2లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మాయమాటలను నమ్మి ప్రజలు మోసపోయారని చెప్పారు. కాంగ్రెస్ 2004 నుంచి 2014 వరకు కేవలం 24 వేల ఉద్యోగాలు ఇస్తే.. బీఆర్ఎస్ 2లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. అదేవిధంగా ఐటీరంగంలో పదేళ్లలో పది లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు. రేవంత్, కోదండరాం నిజాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. బీఆర్ఎస్ హయాంలో కంపెనీలకు పవర్ హాలిడేలు లేవన్నారు. కాంగ్రెస్ అసలు రంగును ప్రజలు త్వరలోనే తెలుసుకుంటారని అన్నారు.


Updated : 12 Jan 2024 10:53 AM GMT
Tags:    
Next Story
Share it
Top