Home > తెలంగాణ > CI Suspension: ప్రవళిక ఆత్మహత్య కేసు .. ఇన్‌స్పెక్టర్‌పై సస్పెన్షన్ వేటు

CI Suspension: ప్రవళిక ఆత్మహత్య కేసు .. ఇన్‌స్పెక్టర్‌పై సస్పెన్షన్ వేటు

CI Suspension: ప్రవళిక ఆత్మహత్య కేసు .. ఇన్‌స్పెక్టర్‌పై సస్పెన్షన్ వేటు
X

హైదరాబాద్ లోని అశోక్ నగర్ హాస్టల్‌లో ప్రవళిక(M Pravalika) అనే యువతి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనకు సంబంధించి విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు చిక్కడపల్లి(Chikkadpally PS) పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ నరేష్‌పై పై పోలీస్ శాఖ సస్పెన్షన్ వేటు వేసింది. ఆయనను తాత్కాలికంగా విధుల నుంచి తొలగిస్తూ.. ఇటీవల హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌‌(Hyderabad police commissioner)గా నియమితులైన సందీప్‌ శాండిల్య ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్స్‌పెక్టర్ నరేష్ సకాలంలో స్పందించక పోవడం వల్లే విద్యార్థులు ఆందోళనకు దిగడం, ప్రతిపక్షపార్టీ నేతలు ఆరోపణలు, విమర్శలకు కారణమైందని పోలీస్ శాఖ భావిస్తోంది.

ప్రవళిక ఆత్మహత్యతో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక్ నగర్ ప్రాంతంలో నిరసనలు జరిగాయి. ఆత్మహత్య ఘటన తర్వాత అశోక్ నగర్ ప్రధాన రహదారిపై పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఆందోళన నిర్వహించడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) పోటీ గ్రూప్ పరీక్షలను నిరంతరం రద్దు చేయడం వల్లే యువతి మృతి చెందిందని ప్రతిపక్షాలు వాదించాయి. అయితే, శ్రవణ్ అనే అబ్బాయితో ప్రవళిక ప్రేమ సంబంధంలో ఉన్నందున, ప్రవళిక వ్యక్తిగత సవాళ్లతో పోరాడుతోందని సూచిస్తూ పోలీసు శాఖ ఒక క్లారిటీ ఇచ్చింది.

అతను ఆమెను మోసం చేసి, మరొక అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడని పోలీసులు ఆరోపించారు. ఇది ప్రవళికకు విపరీతమైన బాధను కలిగించిందని, చివరికి ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు తేల్చారు. ప్రియుడు మోసం చేశాడనే బాధతోనే ఆమె బలవన్మరణం చెందినట్లు వెల్లడించారు. కానీ జాబ్ నోటిఫికేషన్లు వాయిదా పడటంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తూ నిరసనకు దిగి శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

Updated : 16 Oct 2023 8:15 AM IST
Tags:    
Next Story
Share it
Top