Home > తెలంగాణ > ప్రపంచంలోనే అత్యంత కాస్లీ నగరాల్లో భాగ్యనగరానికి చోటు

ప్రపంచంలోనే అత్యంత కాస్లీ నగరాల్లో భాగ్యనగరానికి చోటు

ప్రపంచంలోనే అత్యంత కాస్లీ నగరాల్లో భాగ్యనగరానికి చోటు
X

ప్రపంచంలోనే అత్యంత కాస్లీ నగరాల్లో హైదరాబాద్‌కు స్థానం లభించింది. దేశీయంగా ఈ లిస్టులో మొదటి స్థానంలో ముంబై నిలవగా ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, పూణె , హైదరాబాద్ సిటీలు ఉన్నాయి. అంతర్జాతీయంగా మొదటి స్థానంలో హాంకాంగ్ నిలిచింది. మెర్సర్స్ 2023 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే ఈ విషయాలను తాజాగా వెల్లడించింది.



ఇటీవల మెర్సర్ సంస్థ 2023 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా 5 ఖండాల్లో ఉన్న 227 సిటీల్లో ఈ సర్వే జరిగింది. ఈ సర్వేలో భాగంగా వరల్డ్ వైడ్‎గా ఉన్న కాస్లీ నగరాల జాబితాను సిద్ధం చేసింది సంస్థ. ఆ లిస్టులో ఇండియాలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది ముంబై నగరం. ఆ తరువాత స్థానాల్లో ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, పూణె, హైదరాబాద్‎లు నిలిచాయి. ప్రతి సిటీలోలో ఫుడ్ , ట్రాన్స్‎పోర్ట్ ,దుస్తులు, వసతి వంటి 200అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ సర్వేను నిర్వహించి జాబితాను రెడీ చేశారు.



ప్రపంచం మొత్తంలో చూసుకుంటే కాస్లీ నగరాల్లో ముంబైకి 147వ స్థానం దక్కింది. ఆ తర్వాత ఢిల్లీకి 169, చెన్నై 184, బెంగళూరు 189, హైదరాబాద్ 202 స్థానాల్లో నిలవగా , కోల్‌కతా211, పుణె 213వ ర్యాంకులో ఉన్నాయి. ఇక అంతర్జాతీయంగా చూస్తే హాంకాంగ్ ఈ లిస్టులో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తరువాత సింగపూర్,జూరిచ్.. రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.





Updated : 8 Jun 2023 6:14 AM GMT
Tags:    
Next Story
Share it
Top