Home > తెలంగాణ > అడివి శేష్‌కు హైదరాబాద్‌ సీపీ ఛాలెంజ్‌

అడివి శేష్‌కు హైదరాబాద్‌ సీపీ ఛాలెంజ్‌

అడివి శేష్‌కు హైదరాబాద్‌ సీపీ ఛాలెంజ్‌
X

రైస్ బకెట్ ఛాలెంజ్‌లు సోషల్ మీడియాలో చాలా వచ్చాయి. తాజాగా ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ సహా పలువురు ఈ ఛాలెంజ్ లో పాల్గొని కసరత్తులు చేశారు. ఇప్పుడు అలాంటి ఛాలెంజ్‌ను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రారంభించారు.

జూన్ 23న ఒలింపిక్ డేను పురస్కరించుకుని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తన ట్విట్టర్ అకౌంట్‎లో ఓ వీడియోను షేర్ చేస్తూ.. తాను వ్యాయామం చేస్తున్న ఒక నిమిషం నిడివిగల వీడియోను షేర్ చేశారు. ఈ రోజు మన జీవితాలు ఆందోళనకరంగా మారాయి. అంతకుముందు లేనంత వేగంగా కదులుతున్నాయి. ప్రజలు శారీరక వ్యాయామం లేకుండా ఉండటం కలవరపెడుతోంది. పిల్లలు, యువకులు తమ సెల్‌ఫోన్‌లు, డిజిటల్ గ్యాడ్జెట్‌లకు అతుక్కుపోవడం అత్యంత ఆందోళనకరమైన విషయం. శారీరక శ్రమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు.

ఈ ధోరణిని తిప్పికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని, తన వీడియో ద్వారా అందరిని మేల్కొలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఒలింపిక్‌డే నుంచి అయినా మీలో మార్పు రావాలని కోరుకుంటున్నాను అని చెబుతూ మీరు వ్యాయామం చేసిన వీడియోను షేర్ చేయండి అంటూ మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌,పీవీ సింధు, యాక్టర్‌ అడివి శేష్, నిఖల్‌కు ట్యాగ్‌ చేసి, ఛాలెంజ్‌ విసిరారు. లేటెస్టుగా యంగ్ హీరో అడివి శేష్ ఈ ఛాలెంజ్‎ను ఆక్సెప్ట్ చేశాడు. తాను వ్యాయామం చేసిన వీడియోను సీపీ ఆనంద్‌కు షేర్‌ చేశాడు. త్వరలో మరింత ఫిట్‌నెస్‌తో తమను రీచ్‌ అవుతానని ఈ వీడియో ద్వారా తెలిపాడు. వీడియో చూసిన సీపీ ఆనంద్‌ ఛాలెంజ్ స్వీకరించినందుకు ధన్యవాదాలు అని రిప్లై కూడా ఇచ్చారు.

Updated : 25 Jun 2023 1:51 PM IST
Tags:    
Next Story
Share it
Top