Home > తెలంగాణ > ఎస్సై ప్రీ వెడ్డింగ్ వీడియో వైరల్.. కమిషనర్ ఏమన్నారంటే..?

ఎస్సై ప్రీ వెడ్డింగ్ వీడియో వైరల్.. కమిషనర్ ఏమన్నారంటే..?

ఎస్సై ప్రీ వెడ్డింగ్ వీడియో వైరల్.. కమిషనర్ ఏమన్నారంటే..?
X

ప్రస్తుత ట్రెండ్లో పెళ్లి అంటే.. ప్రీ వెడ్డింగ్ సాంగ్ ఉండాల్సిందే. అయితే ఓ పోలీస్ జంట ప్రీ వెడ్డింగ్ షూట్ నెట్టింట వైరల్గా మారింది. పలువురు నెటిజన్లు దీనిపై విమర్శలు గుప్పిస్తున్నారు. పోలీస్‌ యూనిఫామ్‌ను సొంత అవసరాల కోసం వాడుతున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. సామాన్యులకు ఓ రూల్, వారికి ఓ రూలా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం ఈ జంటను వెనకేసుకొస్తున్నారు.





పంజాగుట్ట ఎస్సై భావన, ఏఆర్ ఎస్సై కిషోర్ వివాహం అగస్ట్ 26న జరిగింది. ఇప్పుడు వారి ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియోలో ఓ చోట ఇద్దరు ఖాకీ డ్రెస్సులో పోలీస్ వాహనం నుంచి దిగడం ఉంటుంది. యూనిఫాంలో అదీ పోలీస్‌ వాహనంతో ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ చేయడంపై విమర్శలు మొదలయ్యాయి. విధి నిర్వహణలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.





ఈ వివాదంపై హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ ట్ిట్టర్ వేదికగా స్పందించారు. ఆ వీడియోను రీ ట్వీట్ చేసిన సీపీ..కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియోపై మిశ్రమ స్పందన వచ్చింది. పెళ్లి చేసుకోబోతున్నామన్న ఆనందంలో వారిద్దరూ కాస్త అత్యుత్సాహం ప్రదర్శించారు. దీంతో విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. పోలీసు ఉద్యోగం చాలా కష్టమైన పని.. ప్రత్యేకించి మహిళలకు ఇంకా కష్టం. ఇద్దరు పోలీసు అధికారులు మూడు ముళ్ల బంధంతో ఒక్కటవ్వడం కచ్చితంగా సంతోషించాల్సిన విషయం. వారిద్దరూ ప్రీ వెడ్డింగ్‌ షూట్‌లో పోలీస్‌ డ్రెస్ సహా వాహనాన్ని ఉపయోగించడాన్ని నేను తప్పుబట్టడం లేదు. కానీ వారు ముందే మా అనుమతి కోరితే పర్మిషన్ ఇచ్చేవాళ్లం. వాళ్లు చేసిన పని కొందరికి ఆగ్రహం తెప్పించి ఉండొచ్చు. వాళ్లు నన్ను పెళ్లికి పిలవక పోయినప్పటికీ వారిని కలుసుకుని ఆశీర్వదించాలని ఉంది’’ అని రాసుకొచ్చారు.




Updated : 17 Sept 2023 5:58 PM IST
Tags:    
Next Story
Share it
Top