Home > తెలంగాణ > హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..
X

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ రిలీజ్ అయ్యింది. హెచ్‌సీఏ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సహాయ కార్యదర్శి, కోశాధికారి, ఈసీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 20న ఎన్నికల పోలింగ్ జరగనుంది. అక్టోబర్‌ 11 నుంచి 13 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 14న నామినేషన్లను పరిశీలన, 16లోపు నామినేషన్లు ఉపసంహరణకు అవకాశం కల్పించారు. 20న పోలింగ్‌ నిర్వహించి అదే రోజు సాయంత్రం ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ మేరకు హెచ్‌సీఎ ఎన్నికల అధికారి వీఎస్‌ సంపత్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు.





ఇటీవల హెచ్సీఏకు చెందిన 57 క్లబ్ లపై సుప్రీం నియమించిన జస్టిస్‌ లావు నాగేశ్వరరావు కమిటీ నిషేధం విధించింది. 80 క్లబ్‌లను తమ అధీనంలో పెట్టుకున్న 12 మంది సహా వారి కుటుంబ సభ్యులు హెచ్‌సీఏ ఎన్నికల్ని ప్రభావితం చేస్తున్నట్లు కమిటీ గుర్తించింది. కొందరు వ్యక్తులు ఒకటి కంటే ఎక్కువ క్లబ్లు కలిగి ఉండడాన్ని కమిటీ గుర్తించి వేటు వేసింది. ఈ వేటుతో ఆ క్లబ్‌లు, ఎగ్జిక్యూటివ్‌ కమిటీల్లో ఉన్నవాళ్లు హెచ్సీఏ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోలేరు. ఈ క్రమంలో హెచ్సీఏ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడడం ఆసక్తికగా మారింది.






Updated : 30 Sept 2023 10:25 PM IST
Tags:    
Next Story
Share it
Top