Home > తెలంగాణ > రావణకాష్టంలా మణిపూర్...హైదరాబాద్ వైద్యుడు సేవలు

రావణకాష్టంలా మణిపూర్...హైదరాబాద్ వైద్యుడు సేవలు

రావణకాష్టంలా మణిపూర్...హైదరాబాద్ వైద్యుడు సేవలు
X

ఈశాన్య రాష్ట్రం మణిపూర్ రావణకాష్టంలా మారింది. జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుంతోంది. మైతీ సామాజికవర్గానికి ఎస్టీ హోదా ఇవ్వడాన్ని నాగాలు, కుకీ సామాజికవర్గానికి చెందినవారు వ్యతిరేకిస్తున్నారు. రెండు నెలలుగా దీంతో ఒకరిపై ఒకరు దాడులకు దిగుతున్నారు. మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనతో మరోసారి తీవ్ర రూపం దాల్చింది. ఎంతమంది భద్రతా బలగాలను మోహరించిన మణిపూర్ హింస చల్లారడం లేదు. దాడులకు సంబంధించిన వీడియోలు చూస్తుంటే మణిపూర్ పేరు వింటేనే ఆందోళన కలిగిస్తోంది. మనుషులు పశువుల్లా మారి ప్రవర్తిస్తున్నారు. రోజుకో దారుణం వెలుగుచూస్తోంది.

ఇరు వర్గాల దాడుల్లో అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. వేల మంది సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. తినడానికి తిండి, ఉండడానికి ఇళ్లు కూడా లేని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న మణిపూర్ ప్రజలకు హైదరాబాద్‌కు చెందిన ఓ వైద్యుడు సేవలందిస్తున్నాడు. బంజారాహిల్స్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి. మణిపూర్ స్వయంగా వెళ్లి అవసరమైన వారికి వైద్య సేవలతో పాటు బియ్యం,దుస్తులు,కూరగాయలు,మందులు మొదలైనవి సాయంగా వారికి అందించారు.

కోల్ కతా వెళ్లి అక్కడి నుంచి నాగాలాండ్ వెళ్లి అక్కడి నుంచి కారులో,ఇతర వాహనాల్లో మణిపూర్ లోని కంగ్పోక్పి జిల్లాకు,ఇతర ప్రభావిత ప్రాంతాలకు స్వయంగా వెళ్లారు. స్థానిక ఎస్పీ సహకారంతో ప్రజలకు సాయం చేశారు. సుమారు 600 మందికి తాను వైద్య సాయం అందించినట్లు ప్రభుకుమార్ వెల్లడించారు. చాలామంది డయోరియా,వైరల్ ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతున్నారని డాక్టర్ ప్రభుకుమార్ తెలిపారు.చాలామందిలో షుగర్ లెవల్స్ చాలా హైలో ఉన్నాయని చెప్పారు. బాష కారణంగా స్థానికులతో మాట్లాడటం ఒక సమస్యగా మారిందని, అయితే ఓ మెడికల్ ఆఫీసర్,నర్సులు తనకు ఈ విషయంలో సాయమందించారని డాక్టర్ ప్రభుకుమార్ తెలిపారు.


Updated : 22 July 2023 10:22 PM IST
Tags:    
Next Story
Share it
Top