Home > తెలంగాణ > చీరకట్టులో ఉన్న ఫోటో పంపు.. మహిళా ఉద్యోగికి వేధింపులు

చీరకట్టులో ఉన్న ఫోటో పంపు.. మహిళా ఉద్యోగికి వేధింపులు

చీరకట్టులో ఉన్న ఫోటో పంపు.. మహిళా ఉద్యోగికి వేధింపులు
X

తెలంగాణ రాష్ట్రంలో సీఐడీ విభాగంలో ఎస్పీ ర్యాంకులో పనిచేస్తున్న కిషన్ సింగ్ పై కేసు నమోదైంది కిషన్‌ సింగ్‌ తనను వేధిస్తున్నారంటూ టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ మహిళా ఉద్యోగి చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కిషన్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నగరంలోని దిల్‌సుఖ్ నగర్ కొత్తపేటలో టీఎస్‌పీఎస్‌‌పీడీసీఎల్ విభాగంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి సీఐడీ ఎస్పీపై ఫిర్యాదు చేశారు. తన ఫోన్‌కు డీఎస్పీ అసభ్యకరమైన మేసేజ్‌లు, ఫోటోలు పంపుతున్నారని మహిళ ఉద్యోగి ఫిర్యాదు చేశారు

‘‘కిషన్‌సింగ్‌.. నా ఫోన్‌కు అసభ్యకర మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు పంపిస్తున్నారు. చీర కట్టుకుని ఉన్న ఫొటోలు పంపాలంటూ వేధిస్తున్నారు. ఆ టార్చర్‌ తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించాను’’ అని మహిళా ఉద్యోగి ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం సరూర్‌నగర్‌ స్టేడియంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో కిషన్‌సింగ్‌ పరిచయమైనట్లు ఆ మహిళ తెలిపారు.




Updated : 30 July 2023 1:51 PM IST
Tags:    
Next Story
Share it
Top