నిరుద్యోగులకు గుడ్న్యూస్...బీటెక్ అర్హతతో ఉద్యోగాలు
X
బీటెక్ అర్హతతో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా ? కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో కొలువే మీ లక్ష్యమా ? అయితే ఈ వార్త మీ కోసమే. హైదరాబాద్ వేదికగా ఉన్న భారత ప్రభుత్వరంగ సంస్థ ఆధ్వర్యంలోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఉద్యోగ భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 100 టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఆసక్తిగల వారు ఈనెల 10,11 తేదీల్లో నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరుకావొచ్చు. పూర్తి వివరాలు https://www.ecil.co.in/ వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి.
పూర్తి వివరాలు
ఉద్యోగం పేరు : టెక్నికల్ ఆఫీసర్లు
మొత్తం ఖాళీలు: 100
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత
విభాగాలు: మెకానికల్/ ఎలక్ట్రానిక్స్ /, ఇన్ స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీలు
అనుభవం: కనీసం 01 ఏడాది పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.25,000
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ వేదిక: Corporate Learning & Development Centre, Nalanda Complex, TIFR Road, Electronics Corporation of India Limited, ECIL Post, Hyderabad – 500062.
ఇంటర్వ్యూ తేది: ఆగస్టు 10, 11 తేదీల్లో
ఇంటర్వ్యూ సమయం: ఆగస్టు ఉదయం 10, 11 తేదీల్లో ఉదయం ఉంటుంది. సుమారు 10 గంటల నుంచి ఉండే అవకాశం