Home > తెలంగాణ > ఉప్పల్‌ టికెట్ కోసం మళ్లీ బొంతు ప్రయత్నం.. చాన్స్ ఉందా?

ఉప్పల్‌ టికెట్ కోసం మళ్లీ బొంతు ప్రయత్నం.. చాన్స్ ఉందా?

ఉప్పల్‌ టికెట్ కోసం మళ్లీ బొంతు ప్రయత్నం.. చాన్స్ ఉందా?
X

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలు కావడంతో కోరుకున్న సీట్లలో పాగాలు బలంగా పడుతున్నాయి. టికెట్లు పొందడానికి తమ గొప్పేమిటో చెప్పుకోవడంతోపాటు పోటీదారుల బలహీనతలు బయటిపెట్టి, వీలైతే బురదజల్లి అనుకున్నది సాధించే పనుల్లో ఆశావహులు బిజీగా ఉన్నాయి. అధికార పార్టీకి, విపక్షాలకు ఈ ఎన్నికలు కీలకం కావడంతో మిగతా విషయాలను పక్కనబెట్టి గెలుపు గుర్రాలపైనే కన్నేశాయి. కొన్ని కీలకమైన స్థానాల్లో టికెట్ల కోసం దిగ్గజాలు పోటీ పడుతుండడంతో టికెట్ ఎవరికిస్తే బావుంటుందని మల్లగుల్లాలు పడుతున్నాయి. వాటిలో ఉప్పల్ ఒకటి. 2009లో ఉనికిలో వచ్చిన ఈ స్థానంలో ఇప్పటివరకు మూడుసార్లు ఎన్నికలు జరగ్గా ఒకసారి గెలిచిన పార్టీ మరోసారి గెలవడకపోడం గమనార్హం. ఈసారి ఈ ట్రెండను బద్దలు కొట్టి మళ్లీ తమ అభ్యర్థినే గెలిపిచడానికి బీఆర్ఎస్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. హైదరాబాద్ మాజీ మేయర్, కేటీఆర్ సన్నిహితుడు బొంతు రామ్మోహన్ టికెట్ విషయంలో ముందంజంలో ఉన్నట్లు సమాచారం. టికెట్ తనకే వస్తుందన్న ధీమాతో ఆయన ప్రజలకు చేరువ కావడానికి ఇప్పటికే నియోజక వర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. సాంఘిక సేవా కార్యక్రమాల్లో, పండుగలు పబ్బాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

సిట్టింగ్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి మాత్రం టికెట్ తనకే వస్తుందని ధీమాతో ఉన్నారు. బొంతు రామ్మోహన్ తోపాటు మరికొందరు పార్టీ నేతలు టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుండడంతో నియోజకవర్గ శ్రేణుల్లో చీలికలు వస్తున్నాయి. భేతి అందరినీ కలుపుకుపోవడంలో విఫలమయ్యారని, పనితీరు సరిగ్గా లేని పార్టీకి ఫిర్యాదులు అందుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో చరుకైన పాత్ర పోషించిన రామ్మోహన్ మేయర్‌గా తను అందించిన సేవలు తనకు సానుకూలంగా మరతాయని ఆశిస్తున్నారు. 2018లో ఆయనకు టికెట్ వస్తుందని భావించినా కేసీఆర్ భేతిపైనే మొగ్గు చూపారు. మారిన రాజకీయ పరిస్థితిలో గెలిచే అవకాశాలు ఎవరికి మెండుగా ఉంటేవారికే టికెట్ ఇవ్వాలన్నది అధిష్టానం ఆలోచన.

2009లో ఎన్నికల్లో ఉప్పల్లో కాంగ్రెస్ అభ్యర్థి బండారి రాజిరెడ్డి.. బీఆర్ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిని ఓడించారు. 2014లో బీజేపీ అభ్యర్థి ఎన్‌వీఎస్ఎస్ ప్రభాకర్ సమీప ప్రత్యర్థి అయిన భేతిపై విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో భేతి.. ప్రభాకర్‌ను ఓడించారు. ఉప్పల్లో బీజేపీకి పట్టు ఉండడంతో ఈసారి కూడా బలమైన అభ్యర్థిని నిలబెట్టాలని గులాబీ దళం యోచిస్తోంది. కేటీఆర్, కేసీఆర్ తనవైపే ఉన్నారు కాబట్టి టికెట్ ఈసారి కచ్చితంగా తనకే వస్తుందని రామ్మోహన్ రంగంలోకి దిగారు. తెలంగాణ సెంటిమెంటుతో తనకే అవకాశం కల్పిస్తారని, తన భార్య చర్లపల్లి కార్పొరేటర్ కావడం తనకు ప్లస్ పాయింటని ఆయన భావిస్తున్నారు. ‘రెండోసారి గెలిచే ట్రెండ్ లేని’ ఉప్పల్‌పై పార్టీ అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకునే నిర్ణయ తీసుకుంటుందని చెబుతున్నారు. రామ్మోహన్, భేతితోపాటు మరికొందరు కూడా టికెట్ ఆశిస్తున్నారు. వారిలో చిన్నాచితకా బండారి లక్ష్మారెడ్డి, మోతె శోభన్ రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.

Updated : 22 July 2023 2:17 PM IST
Tags:    
Next Story
Share it
Top