Home > తెలంగాణ > హైదరాబాద్ మెట్రో బంపర్ ఆఫర్.. ఆ 3 రోజుల్లో అన్లిమిటెడ్ జర్నీ

హైదరాబాద్ మెట్రో బంపర్ ఆఫర్.. ఆ 3 రోజుల్లో అన్లిమిటెడ్ జర్నీ

హైదరాబాద్ మెట్రో బంపర్ ఆఫర్.. ఆ 3 రోజుల్లో అన్లిమిటెడ్ జర్నీ
X

77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. మెట్రో ప్ర‌యాణికుల‌కోసం సూప‌ర్ సేవ‌ర్ ఫ్రీడం ఆఫ‌ర్ పేరుతో కొత్త పాస్‌ను తీసుకొచ్చింది. కేవలం రూ.59 చెల్లించి.. ఈ నెల 12, 13, 15 తేదీల్లో నగరంలో ఏ చోటుకైనా.. ఎన్నిసార్లయినా ప్రయాణించొచ్చని హైదరాబాద్ మెట్రో సంస్థ వెల్లడించింది. సూపర్ సేవర్ ఫ్రీడం ఆఫర్ పేరుతో తీసుకొచ్చిన ఈ ఆఫర్ ను నగర వాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరింది. L&T మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ కేవీబీ రెడ్డి మాట్లాడుతూ ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సూపర్ సేవర్ ఫ్రీడం ఆఫర్ తీసుకొచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు.


Updated : 11 Aug 2023 6:51 PM IST
Tags:    
Next Story
Share it
Top