Home > తెలంగాణ > స్టూడెంట్స్కు బంపర్ ఆఫర్.. మెట్రోలో జాయ్ రైడ్.. ఏం చేయాలంటే..?

స్టూడెంట్స్కు బంపర్ ఆఫర్.. మెట్రోలో జాయ్ రైడ్.. ఏం చేయాలంటే..?

స్టూడెంట్స్కు బంపర్ ఆఫర్.. మెట్రోలో జాయ్ రైడ్.. ఏం చేయాలంటే..?
X

మొదటిసారి హైదరాబాద్ మెట్రో రైలు విద్యార్థుల కోసం ఆలోచించింది. వాళ్ల కోసం అదిరిపోయే వార్తను తీసుకొచ్చింది. ఇప్పటివరకు మహిళలు, వృద్ధులు, రోజూ ప్రయాణించే వాళ్లకోసం ఆఫర్లు పెట్టిన మెట్రో.. ఇప్పడు స్టూడెంట్స్‌ కోసం కూడా ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. స్టూడెంట్ పాస్ తో విద్యార్థులు ఇక నుంచి తక్కువ ధరలో హ్యాపీగా స్కూళ్లు, కాలేజీలకు వెళ్లొచ్చు. ఈ స్టూడెంట్ పాస్ తో 20 ట్రిప్పులకు పాస్ తీసుకుంటూ 30 ట్రిప్పులు తిరగొచ్చని తెలిపింది. కానీ కొన్ని షరుతులను విధించింది..





స్టూడెంట్ పాస్ తీసుకున్నవాళ్లు:

మెట్రో పాస్ కోసం విద్యార్థులు తప్పనిసరిగా కొత్త స్మార్ట్ కార్డ్స్ కొనుగోలు చేయాలి.

ఈ పాస్ కొనుగోలు చేసిన తేదీ నుంచి 30 రోజుల వరకు చెల్లుబాటు అవుతుంది.

ఈ ఆఫర్ 1 జూలై 2023 నుంచి 31 మార్చి 2024 వరకు.. దాదాపు తొమ్మిది నెలల పాటు అందుబాటులో ఉంటుంది.

ఒక్కో స్టూడెంట్ కు ఒక స్మార్ట్ కార్డ్ మాత్రమే జారీ చేయబడుతుంది.

1998, 1 ఏప్రిల్ తర్వాత పుట్టిన స్టూడెంట్స్.. ఈ పాస్ తీసుకునేందుకు అర్హులు. ఈ ఆఫర్ పరిమిత కాలం అందుబాటులో ఉంటుంది.

మెట్రో నిర్ణయం ప్రకారం స్టూడెంట్ పాస్ ను ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చు.

ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెడ్ లైన్ - జేఎన్టీయూ, SR నగర్, అమీర్‌పేట్, విక్టోరియా మెమోరియల్, దిల్‌‌షుఖ్ నగర్.. గ్రీన్ లైన్ - నారాయణగూడ, బ్లూ లైన్ - నాగోల్, పరేడ్ గ్రౌండ్స్, బేగంపేట్ అంతేకాకుండా రాయదుర్గ్ వద్ద పాస్‌లను కొనుగోలు చేసుకోవచ్చు.







Updated : 1 July 2023 8:58 PM IST
Tags:    
Next Story
Share it
Top