Home > తెలంగాణ > రికార్డ్ ల మోత మోగిస్తున్న హైదరాబాద్ మెట్రో

రికార్డ్ ల మోత మోగిస్తున్న హైదరాబాద్ మెట్రో

రికార్డ్ ల మోత మోగిస్తున్న హైదరాబాద్ మెట్రో
X

హైదరాబాద్ మెట్రో ఎప్పుడూలేని విధంగా రికార్డ్ లను నమోదు చేసుకుంటోంది. నగర ప్రజలు మెట్రో ట్రైన్స్ ను తెగ ఉపయోగించడంతో ఇప్పుడు మరోకొత్త మైలురాయిని చేరుకుంది. మొదటిసారి ప్రయాణికుల సంఖ్య 5లక్షలు దాటింది.

ట్రాఫిక్ ప్రాబ్లెమ్స్ ఎవాయిడ్ చేయడానికి హైదరాబాద్ వాసులు మెట్రో బాట పడుతున్నారు. దీంతో ఇందులో ప్రయాణించేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అన్ని మార్గాల్లో రాకపోకలు సాగిస్తున్న మెట్రో రైళ్ళు జనాలతో కిటకిటలాడుతున్నాయి. ఇప్పుడు ఈ సంఖ్య ఏకంగా 5లక్షలకు చేరింది. దానికి తగ్గట్టే మెట్రోలను కూడా అభివృద్ధి చేస్తున్నామని ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీ కేవీబీ రెడ్డి చెబుతున్నారు. భవిష్యత్తులో మరిన్ని మెట్రో ట్రిప్పులు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు.





మియాపూర్-ఎల్బీనగర్

అన్నింటికన్నా మియాపూర్-ఎల్బీనగర్ మధ్య నడుస్తున్న మెట్రో ట్రైన్ అన్నింటికన్నా టాప్ లో ఉంది. ఈ రైలును ఎక్కువగా ప్రయాణికులు ఉపయోగిస్తున్నారు. ఒక్క సోమవారం రోజునే 2.60 లక్షల మంది ప్రయాణం చేశారు. దీని తర్వాత స్థానంలో నాగోల్-రాయదుర్గం కారిడార్ ఉంది. 2.25 లక్షల మంది ఇందులో ప్రయాణించారు. రాయదుర్గం స్టేషన్ నుంచి ఎక్ువగా 32వేల మంది ప్రయాణించగా, ఎల్బీ నగర్ నుంచి 30 వేల మంది ప్రయాణించారు. అమీర్ పేట్ నుంచి 29 వేల మంది, మియాపూర్ నుంచి 23వేల మంది మెట్రోలో ప్రయాణాలు చేశారు.





Updated : 5 July 2023 5:51 AM GMT
Tags:    
Next Story
Share it
Top