హైదరాబాద్లో మావోయిస్టు కీలక నేత అరెస్ట్
X
మావోయిస్టు నేత అరెస్ట్ అయ్యాడు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సందీప్ దీపక్‌రావును అరెస్టు చేసినట్టు డీజీపీ అంజనీ కుమార్ ప్రకటించారు. దీనికి సంబంధించిన వివరాలను డీజీపీ మీడియా సమావేశంలో వెల్లడించారు. పలువురు మావోయిస్టు అగ్రనేతలతో దీపక్‌రావు సమావేశాలు జరిపారని, పశ్చిమ కనుమల ప్రత్యేక జోనల్ కమిటీ కార్యదర్శిగా ఉన్నారని అంజనీ కుమార్ చెప్పారు. కర్నాటక, తమిళనాడు, కేరళ టై జంక్షన్ ఏరియాలో కీలకంగా వ్యవహరించారని అన్నరాు.
ఏడాది కాలంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్న దీపక్‌రావు మూడు రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చారు. ఆయన రాకకు సంబంధించి కచ్చితమైన సమాచారం అందడంతో పక్కా ప్లాన్తో అరెస్టు చేసినట్లు డీజీపీ చెప్పారు. దీపక్ రావు కోసం మహారాష్ట్ర, కేరళ, కర్నాటక పోలీసులతో పాటు ఎన్‌ఐఏ బృందాలు గాలిస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం దీపక్‌పై రూ.25లక్షల రివార్డు కూడా ప్రకటించింది.