Home > తెలంగాణ > ఒకసారి దొరికినా బుద్ధి రాలేదు.. మళ్లీ అదే పాడు పని

ఒకసారి దొరికినా బుద్ధి రాలేదు.. మళ్లీ అదే పాడు పని

ఒకసారి దొరికినా బుద్ధి రాలేదు.. మళ్లీ అదే పాడు పని
X

మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. స్పా సెంటర్ పై నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు చేసి.. ముగ్గురు నిర్వాహకులు, 10 మంది యువతులు, 18 మంది విటులను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నగరంలోని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 లోని ఓ అపార్ట్మెంట్లో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి, వారందరిని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు.





బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లోని ఓ అపార్ట్ మెంట్ లో నేచురల్ హెల్త్ త్రూ ఆయుర్వేద పేరుతో రాయల శృతి, రమణ, జహీద్ ఉల్ హక్ లు.. మసాజ్ సెంటర్ నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వివిధ ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి క్రాస్ మసాజ్ చేసి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు నిర్ధారించారు. ముగ్గురు నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. మసాజ్ సెంటర్‌లో పట్టుబడిన యువతులను రెస్క్యూ హోమ్‌కు తరలించారు. ఈ స్పా సెంటర్ నిర్వాహకులపై గతంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కూడా దాడులు చేసినట్లు పోలీసులు తెలిపారు.





ఈ గ్యాంగ్ కు కీలక సూత్రధారిగా ఉన్న శృతి డాక్టర్ కావాలనుకొని ఉక్రెయిన్‌లో మెడిసిన్ సీట్ కూడా సంపాదించింది. ఫస్ట్ ఇయర్ పూర్తి చేసిన శృతి.. ఆ తర్వాత సెకండ్ ఇయర్ ఫీజు చెల్లించలేక స్వస్థలం భద్రాచలంకు వచ్చింది. అనంతరం అమీర్ పేట్ లో హెయిర్ హోస్టస్ గా శిక్షణ తీసుకుంది. అదే సమయంలో బంజర్ హిల్స్ లోని ఓ స్టార్ హోటల్లో రిసెప్షనిస్ట్ గాను పనిచేసింది. డాక్టర్ గా ఎయిర్ హోస్టరుగా కన్న కలలు కాకపోవడంతో తేలిగ్గా డబ్బు సంపాదించాలనుకొని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మసాజ్ సెంటర్ తెరిచింది. అమ్మాయిలను రప్పించి క్రాస్ మసాజ్ వ్యభిచారం చేయిస్తూ డబ్బులు సంపాదించింది. సమాచారం తెలుసుకున్న పంజాగుట్ట పోలీసులు మసాజ్ సెంటర్ లో దాడులు చేసి నిందితురాలు శృతిని అదుపులో తీసుకుని జైలుకి పంపారు. జైల్ నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా శృతితో మార్పు రాలేదు. బంజారాహిల్స్ లో స్పా సెంటర్ ముసుగులో వ్యభిచార రాకెట్ కు తెరలేపింది. దీంతో రెండోసారి శృతి పోలీసులకు చిక్కింది. శృతితో పాటు మరో ఇద్దరిని రిమాండ్ కు తరలించారు పోలీసులు.

Updated : 27 Jun 2023 6:56 AM GMT
Tags:    
Next Story
Share it
Top