Home > తెలంగాణ > Vehicle Checking : తనిఖీల నుంచి తప్పించుకోనేందుకు దారుణం.. వీడియో

Vehicle Checking : తనిఖీల నుంచి తప్పించుకోనేందుకు దారుణం.. వీడియో

Vehicle Checking : తనిఖీల నుంచి తప్పించుకోనేందుకు దారుణం.. వీడియో
X

హైదరాబాద్‌ చిలకలగూడ ప్రాంతంలో దారుణం జరిగింది. డ్యూటీలో ఉన్న ఓ పోలీసు ఉద్యోగిని ఓ కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా.. చిలకలగూడ వద్ద గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌కు గుర్తు తెలియని కారు ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో సిబ్బంది, స్థానికులు కలసి ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సికింద్రాబాద్‌లోని గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలకలగూడ అలుగడ్డ బావి వద్ద సదరు కానిస్టేబుల్ వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ దారుణం జరిగింది. వేగంగా వెళ్తున్నవారిని అడ్డుకునేందుకు భారీ కేడ్లును ఏర్పాటు చేశారు. అటుగా వస్తున్న వాహనాలను తనిఖీలు చేస్తున్నారు పోలీసులు.. పోలీసులు ఆపుతున్నా.. మితిమీరిన వేగంగా వచ్చిన ఓ కారు భారీ కేడ్లను సైతం తప్పించుకుంది. ఆ కారును ఆపేందుకు యత్నించిన కానిస్టేబుల్ మహేశ్‌ను ఢీ కోట్టింది. దీంతో మహేశ్ ఎగిరి కింద పడిపోయాడు. కిందపడిపోయిన మహేష్‌ను మిగిలిన పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఎలాంటి ప్రాణపాయం లేదని.. చేయి మాత్రం విరిగినట్లు డాక్టర్లు తెలిపారు. గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు నెంబర్ ఆధారంగా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Updated : 20 Oct 2023 1:41 PM IST
Tags:    
Next Story
Share it
Top