Hyderabad Police :ఈ పోలీస్ వేసిన తీన్మార్ డ్యాన్స్ చూసి తీరాల్సిందే.. వీడియో
X
"ఎంత ఒత్తిడిలో ఉన్నా, ఏ పని చేస్తున్నా.. తీన్మార్ బీట్ వింటే.. కాలు కదపాల్సిందే.. స్టెప్పులేయాల్సిందే." (Ganesh Immersion) ఇక పెళ్లి బరాత్లు, నిమజ్జనాల వేళ చెప్పాల్సిన పనిలేదు. కళ్ల ముందు అంతమంది జనాలు డ్యాన్స్ చేస్తుంటే.. తెలియకుండానే వాళ్లలో కలిసిపోతాం. ఇక హైదరాబాద్ గణేష్ నిమజ్జన ఉత్సవాలంటే ఓ క్రేజ్ ఉంటుంది. వినాయకుడి శోభాయాత్ర, చుట్టూ వేలాది జనాలు, పాటలు ఆటలు, జయ జయ ధ్వానాలు.. ఇవన్నీ చూస్తూ ఎవరాగుతారు చెప్పండి. ఇక్కడా అదే జరిగింది. గణేష్ నిమజ్జనాల్లో ట్యాంక్ బండ్ వద్ద సెక్యూరిటీగా ఉన్న పోలీసులు అదే చేశారు. (Hyderabad Police theenmar steps) ఉండబట్టలేక పోయారేమో.. భక్తులతో కలిసి తీన్మార్ స్టెప్పులేశారు.
లీడర్లు, అధికారులు, పోలీసులు అనే తేడానే కనిపించలేదు. ఫుల్ జోష్ లో డ్యాన్స్ చేస్తూ ఆనందంగా గడిపారు. పోలీసులను చూసిన అక్కడి జనం ఈలలు వేస్తూ వాళ్లలో ఉత్సాహాన్ని నింపారు. వాళ్లతో కాలు కదిపి శోభాయాత్రకు కొనసాగించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఫ్రెండ్లీ పోలీస్, మాస్ పోలీస్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం గణేష్ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరుగుతుంది. నగరంలోని వేలాది గణనాయకులు ట్యాంక్ బండ్ వైపు కదిలి వెళ్తున్నారు. ఇదంతా చూడ్డానికి వేలాది మంది భక్తులు తరలి రాగా.. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసి.. నిమజ్జన కార్యక్రమం సజావుగా జరిగేలా చూస్తున్నారు.