వానల్లో ఈ పనులు చేయొద్దు.. పోలీసుల హెచ్చరికలు
X
తెలుగు రాష్ట్రాలు కుండపోత వానలతో అతలాకుతలం అవుతున్నాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రమాదాలు జరిగినే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు బయటకి రావొద్దని సూచించారు. పనులపై బయటికి వెళ్లేవారికి కూడా గట్టి సూచనలు చేశారు. వర్షాల వల్ల నీరు నిలవడంతో ప్రమాదాలు జరిగే అవకాశముంది కనుక కొన్ని జాగ్రత్తలు పాటించాలని కోరారు.
ఇవీ సూచనలు..
అత్యవసర సమయాల్లో 100కి డయల్ చేయాలి.
పొంగుతున్న కాల్వలు, కల్వర్టులు దాటకూడదు.
కరెంటు స్తంభాలకు, పడిపోయిన కరెంటు తీగలకు దూరంగా ఉండాలి.
రోజూ వెళ్లే దారిలోనే వెళ్లాలి. త్వరగా వెళ్లాలని కొత్త దారిలో వెళ్లే ప్రమాదాలు జరగొచ్చు.
పాత గోడలు, పాత భవనాల పక్కన చెట్ల కింద, హోర్డింగుల కింద ఉండకూడదు.
పిల్లలను ఆడుకోవడానికి బయటికి పంపొద్దు. మ్యాన్ హోల్స్ దగ్గరికి ఎవరూ వెళ్లకూడదు.
చెరువులకు మురిక్కాల్వలకు దూరంగా ఉండాలి.