Home > తెలంగాణ > న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు

న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు

న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు
X

న్యూ ఇయర్‌ వేడుకలపై హైదరాబాద్‌ పోలీసులు ఆంక్షలు విధించారు. రాత్రి ఒంటి గంటలోపే వేడుకలు ముగించాలని ఆదేశించారు. ఈ మేరకు న్యూయర్‌ ఈవెంట్స్ మార్గదర్శకాలను జారీ చేశారు. న్యూ ఇయర్ ఈవెంట్‌ నిర్వాహించే వారు 10 రోజుల ముందుగానే పర్మిషన్ తీసుకోవాలని సూచించారు. ఈవెంట్‌లో కచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. వేడుకల్లో 45 డెసిబుల్స్‌ కంటే ఎక్కువ శబ్దం రాకుండా, ఆశ్లీల నృత్యాలు లేకుండా చూసుకోవాలని అన్నారు.

ప్రతి ఈవెంట్‌కు తప్పనిసరిగా సెక్యూరిటీ ఉండాలన్న పోలీసులు ఈవెంట్ నిర్వహించే ప్లేస్ కెపాసిటీకి మించి పాసులు ఇవ్వొద్దని ఆదేశించారు. పార్కింగ్ ఇబ్బందులు లేకుండా చూసుకోవడంతో పాటు ట్రాఫిక్ సమస్య లేకుండా జాగ్రత్తపడాలని అన్నారు. ఈవెంట్స్‌లో మైనర్లకు లిక్కర్ సర్వ్ చేసేందుకు అనుమతి లేదని, వేడుకల్లో డ్రగ్స్ వాడితే కఠిన తీసుకుంటామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.

Updated : 19 Dec 2023 6:15 PM IST
Tags:    
Next Story
Share it
Top