ఖబడ్దార్..కక్కుర్తి పడి మహిళలను టచ్ చేస్తే ..
X
బస్సులు, రైళ్లు, క్యూలైన్లు..ప్రజలు గుంపులు గుంపులుగా ఉండే ప్రదేశాలే వారి టార్గెట్. అదును చూసుకుని అమ్మాయిలు ఎక్కడ ఉంటే అక్కడ పోకిరీలు వచ్చి వాలిపోతుంటారు. ఎవరూ చూడటంలేదని, పెద్దగా పట్టించుకోరని ఆకతాయిలు పబ్లిక్ ప్లేసుల్లో అసభ్యంగా ప్రవర్తిస్తూ రెచ్చిపోతుంటారు. అమ్మాయిలు, మహిళలను దొరికిందే ఛాన్స్‌గా టచ్ చేస్తూ క్షణికానందం పొందుతుంటారు. అయితే ఇలాంటి ఆకతాయిలను కంట్రోల్లో పెట్టేందుకు షీ టీమ్స్ ఎప్పుడూ అలర్ట్‌గా ఉంటాయని , వారిని ఓ కంట కనిపెడుతూ ఉంటాయని తెలిపేందుకు తాజాగా హైదరాబాద్ పోలీసులు ట్విట్టర్లో ఓ పోస్ట్ షేర్ చేశారు.ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. వెలికివేశాలు వేసిన వారు ఎవరైనా సరే వెతికిమరీ పట్టుకుని ఊచలు లెక్కబెట్టేలా చర్యలు తీసుకుంటామని వీడియో ద్వారా పోకిరీలకు వార్నింగ్ ఇచ్చారు. ప్రజలు గుంపులుగా ఉన్న ప్రదేశాల్లో కొంత మంది పోకిరీలు అమ్మాయిలను తాకుతున్న దృశ్యాలను షీ టీమ్స్ వీడియో తీసి వారిని అరెస్ట్ చేశాయని చెప్పారు. మీరు చేసే పనులన్నీఓ కంట కనిపెడుతున్నాం.. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా అంటూ హెచ్చరించారు.
Your activities are being watched, so behave...#SHETeams #HyderabadCityPolice pic.twitter.com/45shQZw3tY
— Hyderabad City Police (@hydcitypolice) September 22, 2023