Home > తెలంగాణ > రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో హైదరాబాద్‌ వాసి మృతి.. కేటీఆర్‌ సంతాపం

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో హైదరాబాద్‌ వాసి మృతి.. కేటీఆర్‌ సంతాపం

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో హైదరాబాద్‌ వాసి మృతి.. కేటీఆర్‌ సంతాపం
X

రష్యా-ఉక్రెయిన్‌ పోరులో హైదరాబాద్‌ చెందిన యువకుడు బలైపోయాడు. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యా తరపున పోరాడుతూ నగరానికి చెందిన మహ్మద్‌ అఫ్సాన్‌ (30) అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. అయితే ఉద్యోగం విషయంలో మోసపోవడంత ఆఫ్సాన్‌ రష్యన్‌ ఆర్మీలో బలవంతంగా చేరాల్సి వచ్చినట్లు సమాచారం. కాగా రష్యా సైన్యానికి సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న దాదాపు 20 మంది భారతీయులను తీసుకొచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపిన కొద్ది రోజులకే ఈ విషాదం వెలుగుచూసింది. మరోవైపు మహ్మద్‌ అస్ఫాన్‌ను రష్యా నుంచి హైదరాబాద్‌ తీసుకొచ్చేందుకు సాయం కోసం అతడి కుటుంబం ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఓవైసీని సంప్రదించింది. ఈ క్రమంలో ఎంఐఎం మాస్కోలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించగా, అస్ఫాన్‌ మరణించినట్లు అక్కడి అధికారులు ధృవీకరించారు. మృతికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

హైదరాబాద్‌లోని నాంపల్లి బజార్‌ ఘాట్‌ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ ఆస్ఫాన్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మరికొంతమంది లేబర్‌ పని కోసం గత ఏడాది గల్ఫ్‌ దేశానికి వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత సెక్యూరిటీ లేబర్‌గా పనిచేస్తే ఎక్కువ శాలరీ వస్తుందని స్థానిక ఏజెంట్లు ఆశ చూపి రష్యాకు పంపించారు. అక్కడ రష్యన్‌ ఆర్మీలో సెక్యూరిటీ లేబర్‌, కుక్‌గా పనిచేయించుకున్నారు. కాగా, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో గత ఏడాది డిసెంబర్‌ 31వ తేదీన రష్యన్‌ ఆర్మీతో కలిసి వారు ఉక్రెయిన్‌లోకి వెళ్లారు. ఆ తర్వాత వారి దగ్గర నుంచి ఎలాంటి సమాచారం అందలేదు. దీంతో బాధితుల కుటుంబాలు ఆందోళనకు గురయ్యాయి. ఈ క్రమంలోనే తమ బిడ్డ ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన విషయాన్ని ఆస్ఫాన్‌ కుటుంబసభ్యులు హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ దృష్టికి తీసుకెళ్లారు. వారిని వెనక్కి తీసుకురావాలని కోరారు. వాళ్ల విజ్ఞప్తిపై స్పందించిన ఒవైసీ.. మాస్కోలోని భారత రాయబార కార్యాలయానికి లేఖ రాశారు. ఈ క్రమంలో రష్యా సైన్యానికి సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న 20 నుంచి 30 మంది భారతీయుల్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆ తర్వాత కొద్దిరోజుల్లోనే ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో హైదరాబాద్‌ యువకుడు చనిపోయిన విషయం తెలిసి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా విచారం వ్యక్తం చేశారు. ఆస్ఫాన్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఉద్యోగాల కోసం వెళ్లి మోసపోయి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చిక్కుకుపోయిన యువకుల్ని తిరిగి తీసుకొచ్చేందుకు సాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

Updated : 7 March 2024 4:34 AM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top