హైదరాబాద్‌లో గొర్రెలకు భారీ డిమాండ్.. ధర ఏకంగా 4వేలు పైకి..
X
హైదరాబాద్ పాతబస్తీలోపాటు పలు చోట్లు గొర్రెల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. బక్రీద్ పండుగ కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీల నుంచి కూడా భారీ సంఖ్యలో జీవాలను తరలిస్తున్నారు. బోనాలు పండగ కూడా ఉండడంతో వ్యాపారం మరింత నిండుగా సాగుతోంది. ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒక గొర్రె ధర గత సీజన్ కంటే రూ. 3 వేల నుంచి రూ. 4 వేల ధర ఎక్కువగా పలుకుతోంది. గత బక్రీద్‌లో జత గొర్రెలు రూ. 18వేలకు వచ్చేవి కాగా, ఇప్పుడు రూ. 25 వేలు పైనే పెట్టాల్సి వస్తోంది. ఉత్పత్తి తగ్గడంతోపాటు రవాణా చార్జీలు, ఇతర ఖర్చు కలసి తడిచి మోపెడవుతున్నాయని, ధరలు పెంచక తప్పలేదని వ్యాపారులు అంటున్నారు. నేరుగా అమ్ముకునే కాపర్ల వద్ద ధర కొంచెం తక్కువగానే ఉంది.
టోలిచౌకి, మెహదీపట్నం, చంచల్‌గూడ, నానల్ నగర్, ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట, కిషన్‌బాగ్, గోల్నాక, బంజారాహిల్స్, బోరబండ తదితర ప్రాంతాల్లో వ్యాపారులు సంతలు పెట్టారు. కొన్నిచోట్ల ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగుతోంది. బక్రీద్ సీజన్లో హైదరాద్‌లో గొర్రెలు, మేకలు లక్షల్లో అమ్ముడుపోతుంటాయి. గత ఏడాది 2 లక్షలకుపా అమ్ముడయ్యాయి. 10 నుంచి 14 కిలోలు పడే గొర్రెలను కొనడం ఆనవాయితీ. ఖర్బానీ మాంసాన్ని మూడు భాగాలు చేసి ఒక భాగాన్ని తమకు, ఒక భాగాన్ని బంధుమిత్రులకు, ఇంకో భాగాన్ని పేదలసాదలకు పంచడం ఆనవాయితీ.