Home > తెలంగాణ > ప్రియురాలి కోసం పిజ్జా తీసుకెళ్లిన ప్రియుడు..నాలుగో అంతస్తు నుంచి దూకి

ప్రియురాలి కోసం పిజ్జా తీసుకెళ్లిన ప్రియుడు..నాలుగో అంతస్తు నుంచి దూకి

ప్రియురాలి కోసం పిజ్జా తీసుకెళ్లిన ప్రియుడు..నాలుగో అంతస్తు నుంచి దూకి
X

హైదరాబాద్‎లో విషదకరమైన సంఘటన జరిగింది. తన ప్రియురాలు కోరిందని ప్రేమతో పిజ్జా తీసుకెళ్లిన కుర్రాడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. పిజ్జా ఇవ్వడానికి వెళ్లిన యువకుడు నాలుగో అంతస్తు నుంచి దూకి మరణించాడు. బోరబండలో ఈ ఘటన జరిగింది. యువకుడి మరణంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.





19 ఏళ్ల మహమ్మద్ షోయబ్ బోరబండలో ఉంటున్నాడు. అక్కడే ఓ బేకరీలో ఉద్యోగం చేస్తున్నాడు..గత కొంత కాలంగా అదే ప్రాంతానికి చెందిన యువతితో షోయబ్‎కు పరిచయం ఏర్పడింది. వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. తరచుగా మాట్లాడటం కలవం చేస్తుండేవారు. ఓ రోజు ఆమె కోరిందని ఆదివారం రాత్రి పిజ్జా తీసుకొని ఆమె ఇంటికి వెళ్లాడు షోయబ్ . అదే టైంలో యువతి తండ్రి బయటికి రావడంతో కంగారు పడిపోయిన షోయబ్‌, తప్పించుుకోవాలనే ఉద్దేశంతో నాలుగో అంతస్తు నుంచి దూకాడు. తీవ్రంగా గాయపడిన షోయబ్‎ను స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు గవర్నమెంటు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ షోయాబ్‌ సోమవారం చనిపోయాడు. పోలీసులు ఈ విషయాన్ని తెలిపారు. షోయబ్ తండ్రి ఫిర్యాదు మేరకు మిస్టీరియస్ డెత్‎గా పోలీసులు కేసు ఫైల్ చేశారు.




Updated : 7 Aug 2023 9:17 PM IST
Tags:    
Next Story
Share it
Top