Telangana Express : తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు అలర్ట్..
Krishna | 28 Jan 2024 7:59 AM IST
X
X
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులను దక్షిణ మధ్య రైల్వే అలర్ట్ చేసింది. ట్రైన్ టైమింగ్ మారినట్లు ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఇవాళ 8 గంటలు ఆలస్యంగా బయలుదేరనున్నట్లు ప్రయాణికులకు తెలిపింది. ఉదయం 6 గంటలకు బయలుదేరాల్సిన ఈ రైలు ఇవాళ మధ్యాహ్నం 2గంటలకు స్టార్ట్ అవుతుందని వివరించింది. ప్రయాణికులు దానికి అనుగుణంగా తమ ఏర్పాట్లను చేసుకోవాలని సూచించింది. రైలు ఆలస్యానికి కారణాలను మాత్రం అధికారులు వెల్లడించలేదు. కాగా శనివారం కూడా రైలు 8 గంటలు ఆలస్యంగా రైలు బయలుదేరింది. శుక్రవారం సైతం ముంబైలో సాయంత్రం 4 గంటలకు బయలుదేరాల్సిన ట్రైన్ 7 గంటలకు స్టార్ట్ అయ్యింది.
Updated : 28 Jan 2024 7:59 AM IST
Tags: telangana express hyderabad to delhi hyderabad to delhi train telangana express timings irctc telangana express late telangana express resheduled south central railway delhi train hyderabad train trains updates telugu news telugu updates
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire