Home > తెలంగాణ > Kumari Aunty:పర్మిషన్ లేదు.. ఇక్కడ అమ్మకూడదు... కుమారి ఆంటీకి షాక్

Kumari Aunty:పర్మిషన్ లేదు.. ఇక్కడ అమ్మకూడదు... కుమారి ఆంటీకి షాక్

Kumari Aunty:పర్మిషన్ లేదు.. ఇక్కడ అమ్మకూడదు... కుమారి ఆంటీకి షాక్
X

అడపాదడపా సోషల్ మీడియాతో టైమ్ పాస్ చేసే తెలుగు వారికి 'కుమారి ఆంటి' గురించి తెలిసే ఉంటుంది. ఏపీలోని గుడివాడకు చెందిన కుమారి ఆంటీ అలియాస్ దాసరి సాయి కుమారి.. 2011లో హైదరాబాద్ లో స్ట్రీట్‌ఫుడ్‌ సెంటర్‌ను ప్రారంభించారు. మాదాపూర్‌లోని ఐటీసీ కోహినూర్‌ హోటల్‌ ఎదురుగా స్ట్రీట్‌ఫుడ్‌ బిజినెస్‌ను ఏర్పాటు చేసిన సదరు ఆంటీ... రుచికరమైన వెజ్‌, నాన్‌వెజ్‌ వంటకాలను అందిస్తూ మంచి పేరు సంపాదించారు. చికెన్‌ కర్రీ, చికెన్‌ ఫ్రై, బోటీ కర్రీ, ఫిష్‌ కర్రీ, ఫిష్‌ ఫ్రై అంటూ తన ఫుడ్ స్టాల్ కి వచ్చే కస్టమర్ల అభిమానాన్ని పొందారు. ఇక కొందరు యూట్యూబ్‌ ఫుడ్‌ వ్లాగర్స్‌ అయితే.. వరుసగా ఆమె ఫుడ్ బిజినెస్ వీడియోలు చేసి సోషల్ మీడియాలోకి వదిలారు. సెలబ్రెటీలు కూడా ఆమె వద్ద భోజనం చేయటంతో ఒక్కసారిగా కుమారి ఆంటీ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చారు. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు మించి కుమారి ఆంటీ సంపాదన ఉండడంతో ... చాలా మంది నెటిజన్లు ఆమెతో తమ జీవితాన్ని పోల్చుకుంటూ ఫన్నీగా కామెంట్స్‌, మీమ్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో కుమారి ఆంటీ నే ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

అయితే తాజాగా కుమారి ఆంటీకి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల నుంచి ఓ షాక్ తగిలినట్లు తెలుస్తోంది. రోడ్డుపై ఉన్న కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కి వచ్చే కస్టమర్లు.. తమ వాహానాలను రోడ్డు పక్కనే పార్క్ చేస్తుండడంతో.. మిగతా వాహనదారులకు ఇబ్బందికరంగా మారిందని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారట. సోషల్ మీడియా ద్వారా తెగ పాపులర్ అయిన ఈ ఫుడ్ స్టాల్ లో భోంచేసేందుకు చాలామంది కస్టమర్లు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. హైటెక్ సిటీ ప్రాంత ఉద్యోగులతో పాటు మిగతా ప్రాంతాల నుంచి కూడా కస్టమర్లు రావడంతో ఫుడ్ స్టాల్ కి బాగానే గిరాకీ పెరిగినా.. వారి బైక్ ల పార్కింగ్ వల్ల మాత్రం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని, దీని వల్ల లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తున్నాయని పోలీసులు చెబుతున్నారట. అసలు ఇక్కడ పర్మిషన్ లేదని, ఫుడ్ స్టాల్ కి వచ్చే కస్టమర్లకు పార్కింగ్ స్థలాన్ని చూపించాలని హెచ్చరించారట. రోడ్డు పక్కన కాకుండా మరేదైనా ప్రాంతంలో బిజినెస్ ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారట. అయితే ఫుడ్ స్టాల్ యజమాని అయిన కుమారి ఆంటీ మాత్రం రోడ్డు పక్కన బతుకుదెరువు కోసం పెట్టుకున్న తన షాప్ వద్ద పార్కింగ్ స్థలాన్ని ఎలా చూపించగలనంటూ మీడియా ముందు వాపోతున్నారు. తమ పొట్ట మీద కొట్టొద్దని వేడుకుంటున్నారు.

Updated : 30 Jan 2024 7:31 PM IST
Tags:    
Next Story
Share it
Top