Home > తెలంగాణ > Exhibition Grounds: నేటి నుంచి నుమాయిష్.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

Exhibition Grounds: నేటి నుంచి నుమాయిష్.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

Exhibition Grounds: నేటి నుంచి నుమాయిష్.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
X

హైదరాబాద్ నగరంలో నేటి నుంచి అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) ప్రారంభం కానుంది. నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో నిర్వహించే నుమాయిష్‌ను సీఎం రేవంత్‌రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు, మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ప్రారంభిస్తారు. జనవరి 1వ తేది నుంచి ఫిబ్రవరి 15వ తేది వరకు 45 రోజుల పాటు కొనసాగే ఈ ఎగ్జిబిషన్‌లో దేశం నలుమూలల నుంచి వచ్చిన పారిశ్రామికులు తమ ఉత్పత్తులను పరిచయం చేస్తూ 2400 స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఎంట్రీ ఫీజు రూ.40 రూపాయలు ఉంటుందని నిర్వాహకులు స్పష్టం చేశారు. ప్రతీ రోజు మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10 గంటల వరకు ఎగ్జిబిషన్ నడుస్తుందని.. ఇందుకోసం పోలీసు శాఖ, అగ్నిమాపక, వైద్యారోగ్య, పురపాలకశాఖల సమన్వయంతో పటిష్ఠ భద్రత చర్యలు చేపట్టినట్లు వివరించారు. స్టాళ్లలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. కొవిడ్ దృష్ట్యా ప్రతి ఒక్కరు మాస్క్‌ ధరించి రావాలని సూచించారు. వృద్ధుల కోసం వీల్‌ఛైర్స్‌ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ‘నుమాయిష్‌’ దృష్ట్యా సోమవారం నుంచి ఫిబ్రవరి 15వరకు రోజూ సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లోఉంటాయని నగర సీపీ కె.శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.

సిద్ధి అంబర్‌బజార్‌, జాంబాగ్‌ల వైపు నుంచి నాంపల్లి వైపు వెళ్లే ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, భారీ వాహనాలు ఎంజే మార్కెట్‌ వద్ద అబిడ్స్‌ జంక్షన్‌ వైపు మళ్లిస్తారు.

పోలీసు కంట్రోల్‌ రూమ్‌, బషీర్‌బాగ్‌ నుంచి నాంపల్లి వైపు వెళ్లే ఆర్టీసీ జిల్లా, ప్రైవేటు బస్సులు, ఇతర వాహనాలను ఏఆర్‌ పెట్రోల్‌బంక్‌ నుంచి BJR(బషీర్‌బాగ్‌)సర్కిల్ నుంచి అబిడ్స్‌ వైపు పంపిస్తారు.

బేగంబజార్‌ ఛత్రీ నుంచి మాలకుంటవైపు వెళ్లే భారీ, ఇతర వాహనాలు అలాస్కా జంక్షన్‌ నుంచి దారుస్సలాం, ఏక్‌ మినార్‌ మసీదు, నాంపల్లి వైపు వెళ్లాల్సి ఉంటుంది.

దారుస్సలాం(గోషామహల్‌ రోడ్డు) నుంచి అఫ్జల్‌గంజ్‌, అబిడ్స్‌ వైపు వెళ్లే డీసీఎం వాహనాలతో సహా భారీ, ఇతర వాహనాలు అలాస్కా జంక్షన్‌ నుంచి బేగంబజార్‌, సిటీ కాలేజీ, నయాపూల్‌ వైపు మళ్లిస్తారు

మూసాబౌలి/బహదూర్‌పుర వైపు నుంచి నాంపల్లి వైపు వెళ్లాలనుకునే ఆర్టీసీ బస్సులతో సహా ఇతర వాహనాలు సిటీ కాలేజీ వద్ద నయాపూల్‌, ఎంజేమార్కెట్‌ వైపు వెళ్లాల్సి ఉంటుంది.




Updated : 1 Jan 2024 12:59 PM IST
Tags:    
Next Story
Share it
Top