Home > తెలంగాణ > Bio Asia Conference : హైదరాబాద్ వేదికగా..నేటి నుంచి బయో ఆసియా సదస్సు

Bio Asia Conference : హైదరాబాద్ వేదికగా..నేటి నుంచి బయో ఆసియా సదస్సు

Bio Asia Conference : హైదరాబాద్ వేదికగా..నేటి నుంచి బయో ఆసియా సదస్సు
X

ప్రతిష్టాత్మక 21వ బయో ఆసియా సదస్సు హెచ్ఐసీసీలో నేటి నుంచి ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో తొలి రోజు జీనోమ్‌ వ్యాలీలోని భారత్ బయోటెక్‌తో పాటు ఇతర కంపెనీలను విదేశీ ప్రతినిధులు సందర్శిస్తారు. హైదరాబాద్ వేదికగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు మంచి ఆదరణ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రేపు ఈ సదస్సులో ప్రసంగించనునన్నారు. ప్రపంచ దేశాల్లోని 100కి పైగా ప్రముఖ శాస్త్రవేత్తలు, విదేశీ ప్రతినిధులు పాల్లొననున్నారు. ఈ సందర్బంగా జీవ వైద్య సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు, ఫార్మా, పరిశ్రమ రంగాల ప్రోత్సహకాలపై చర్చలు జరుగుతాయి. ఈ అంశాలపై పరిశోధనలు చేస్తున్న అంకుర సంస్థలకు ప్రోత్సాహకాలు, చేయూతలపై పలు కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఈ వేదిక ఉపయోగపడనుంది. ఈ సందర్భంగా నోబెల్‌ పురస్కార గ్రహీత, ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు, ఆచార్య గ్రెగ్‌ ఎల్‌ సెమెంజాకు జీనోమ్‌వ్యాలీ ఎక్స్‌లెన్స్‌ పురస్కారాన్ని అందజేయనున్నారు.





28న పలు చర్చాగోష్ఠిలతో పాటు ముగింపు సమావేశం ఉంటుంది. 700కి పైగా వినూత్న అంకుర సంస్థలు ఈ ప్రతిష్టాత్మక వేదికపై పోటీపడగా నిపుణులు 70 అంకుర సంస్థలను ప్రదర్శనకు ఎంపిక చేశారు. వీటిలో ఐదింటిని తుది జాబితాకు ఎంపిక చేసి, సదస్సు ఆఖరి రోజున ప్రత్యేక పురస్కారాలను అందజేస్తారు. 21వ బయో ఆసియా సదస్సుకు అనూహ్యమైన స్పందన లభించిందని, హైదరాబాద్‌ వేదికగా నూతన ఆవిష్కరణలను ప్రదర్శించడం సంతోషంగా ఉందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. జీవ వైద్య రంగంలో తెలంగాణ అంతర్జాతీయ ఖ్యాతిని విస్తరించడానికి ఈ సదస్సు దోహదపడుతుందన్నారు. ప్రపంచ వేదికపై తెలంగాణ జీవ వైద్య రంగం అభివృద్ధి చెందడానికి, కొత్త ఆవిష్కరణలను శక్తిమంతం చేయడానికి, అద్భుత పరిష్కారాలను ప్రదర్శించడానికి ఈ సదస్సు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఈ సదస్సులో డేటా, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ విప్లవం అంశాలే ప్రధానంగా చర్చలు కొనసాగుతాయని తెలిపారు. అంతర్జాతీయ వేదికపై తెలంగాణను శిఖరాగ్రంలో నిలపడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఆయన తెలిపారు







Updated : 26 Feb 2024 7:21 AM IST
Tags:    
Next Story
Share it
Top