అమెరికాలో ఆకలితో హైదరాబాద్ యువతి.. జై శంకర్‌కు తల్లి లేఖ..
X
అమెరికాలో హైదరాబాద్ యువతి ఆకలితో అలమటిస్తోంది. మాస్టర్స్ చేయడానికి అమెరికా వెళ్లిన యువతి వస్తువులు చోరీ అవ్వడంతోపాటు డిప్రెషన్కు గురై చికాగో రోడ్లపై ఆకలితో అల్లాడుతోంది. ఆమెను కొందరు గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో తన కూతురును తిరిగి హైదరాబాద్ వచ్చేలా చూడాలని కేంద్ర విదేశాంగ మంత్రికి ఆమె తల్లి లేఖ రాశారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ నేత ఖలీకర్ రెహ్మాన్ ట్వీట్ చేశారు.
హైదరాబాద్‌లోని మౌలాలికి చెందిన సయ్యదా లులు మిన్హాజ్ జైదీ 2021 ఆగస్టులో ఎంఎస్ చేసేందుకు అమెరికాకు వెళ్లారు. అక్కడికి వెళ్లిన ఆమె తన తల్లి ఫాతిమాతో తరుచూ ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. కానీ గత రెండు నెలలుగా కూతురు నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లిన కొందరు ఆమెను గుర్తించి కుటుంబసభ్యులకు విషయం తెలియజేశారు. ఆమె వస్తువులను ఎవరో దొంగలించారని.. దీంతో చికాగో రోడ్లపై ఆకలితో అలమటిస్తోందని సమాచారం అందించారు. అంతేకాకుండా లులు మిన్హాజ్ డిప్రెషన్కు లోనవుతున్నట్లు తెలిపారు.
ఈ విషయంపై కేంద్రమంత్రి జైశంకర్ కు తల్లి ఫాతిమా లేఖ రాశారు. తన కుమార్తెను తిరిగి భారత్ తీసుకురావాలని కోరారు. ‘‘నా కుమార్తె సయ్యదా లులు మిన్హాజ్ జైదీ అమెరికాకు మాస్టర్స్ చేసేందుకు వెళ్లింది. రెండు నెలలుగా ఆమె నాకు ఫోన్ చేయడం లేదు. హైదరాబాద్ నుంచి మాకు తెలిసిన కొందరు అమెరికాకు వెళ్లారు. చికాగోలో నా కుమార్తెను గుర్తించారు. ఆమె వస్తువులు చోరీకి గురవడంతో ఆకలితో అలమటిస్తోంది. ఆమెను భారత్‌కు తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని లేఖలో కోరింది.
Request @DrSJaishankar to kindly look into it.@HelplinePBSK @IndiainChicago @IndianEmbassyUS @sushilrTOI @meaMADAD https://t.co/rwtevJ1fWr
— Khaleequr Rahman (@Khaleeqrahman) July 26, 2023