Home > తెలంగాణ > Lotus Eletre E-SUV : ఇండియానే అత్యంత ఖరీదైన కారు..హైదరాబాద్ మహిళ సొంతం

Lotus Eletre E-SUV : ఇండియానే అత్యంత ఖరీదైన కారు..హైదరాబాద్ మహిళ సొంతం

Lotus Eletre E-SUV : ఇండియానే అత్యంత ఖరీదైన కారు..హైదరాబాద్ మహిళ సొంతం
X

భారతదేశంలో అత్యంత ఖరీదైన కారును హైదరాబాద్‌కు చెందిన మహిళ సొంతం చేసుకుంది. ఇప్పటి వరకూ ఇండియాలో ముఖేష్ అంబానీ, రతన్ టాటా, అదానీ, ధోనీతో సహా చాలా మంది బిలియనీర్లు ఖరీదైన లగ్జరీకార్లను కొన్నారు. అయితే ఇప్పుడు రూ.2.55 కోట్ల విలువ చేసే లోటస్ ఎలట్రే ఎస్వీయూ కారును ఓ హైదరాబాద్ మహిళ కొనుగోలు చేసింది. లగ్జరీ కార్లను, ఎలక్ట్రిక్ లైఫ్ స్టైల్ కార్ల తయారీలో లోటస్ గ్రూపు ఎంతో ప్రసిద్ధి చెందింది. గత ఏడాది ఈ సైంస్థ ఇండియాలో తన వ్యాపారాన్ని ప్రారంభించింది.





లోటస్ సంస్థ తమ 'ఎలెట్రే ఈ-ఎస్‌యువీ' కారును ఇండియాలో విడుదల చేసింది. రూ.2.55 కోట్ల విలువైన ఆ కారును హైదరాబాద్‌కు చెందిన హర్షికా రావు కొనుగోలు చేసింది. ఈ కారుకు సంబంధించి ఎలెట్రే, ఎలెట్రే ఎస్, ఎలెట్రే ఆర్ అనే మూడు వేరియంట్లను కంపెనీ అందిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన హర్షికా రావు ముదురు ఎరుపు రంగులో ఉన్న కారును కొనుగోలు చేశారు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.





హర్షికా రావు కొనుగోలు చేసిన కారు ఇండియాలోనే అత్యంత ఖరీదైనది. ఈ కారు ముందు భాగం ఫెరారీలాగా ఉంటుంది. ఆ కారులాగే దీనికి కూడా ఒకే రకమైన డిజైన్ హెడ్‌లైట్ ఉంటుంది. ఈ కారు 20 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతం ఛార్జ్ అవుతుంది. ఇది 600km పరిధిలో 603hp డ్యూయల్-మోటార్ సిస్టమ్‌‌తో నడుస్తుంది. హర్షికా రావు షేర్ చేసిన కారు ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.




Updated : 30 Jan 2024 2:14 PM IST
Tags:    
Next Story
Share it
Top