Home > తెలంగాణ > ఏజెంట్ మోసం.. రష్యా ప్రైవేట్ ఆర్మీలో తెలంగాణ యువకులు..

ఏజెంట్ మోసం.. రష్యా ప్రైవేట్ ఆర్మీలో తెలంగాణ యువకులు..

ఏజెంట్ మోసం.. రష్యా ప్రైవేట్ ఆర్మీలో తెలంగాణ యువకులు..
X

విదేశాల్లో ఉద్యోగం.. మంచి జీతం.. ఏడాదిలో పౌరసత్వం ఖాయం. ఇలాంటి ఆకర్షణీయ ప్రకటనలకు యూత్ ఈజీగా అట్రాక్ట్ అవుతుంటారు. ఇద్దరు తెలంగాణ యువకులు సైతం ఇలాగే ఆకర్షితులయ్యారు. ఓ యూట్యూబర్ ఏజెంట్గా వ్యవహరించి వారిని రష్యాకు పంపాడు. అయితే బతుకుదెరువు కోసం పరాయి దేశం వెళ్లిన వారు ఏజెంట్ చేసిన మోసానికి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుపోయారు.

హైదరాబాద్కు నాపంల్లిలోని జబార్ ఘాట్ ప్రాంతానికి చెందిన మహమూద్ అస్ఫాన్, నారాయణపేట్ ప్రాంతానికి చెందిన మరో యువకుడితో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 12 మంది సెక్యురిటీ హెల్పర్ ఉద్యోగం కోసం బాబా వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ నడిపే ఫైసల్ ఖాన్ ను సంప్రదించారు. ప్రొబేషన్ పీరియడ్‌లో నెలకు రూ.45,000 జీతం ఇస్తారని సెక్యూరిటీ హెల్పర్ జాబ్ ఇస్తామని ప్రలోభపెట్టారు. త్వరలోనే జీతం పెంచుతారని కూడా చెప్పడంతో అతని మాటలు నమ్మిన వారంతా రూ. 3లక్షల చొప్పున చెల్లించారు. ఆ తర్వాత 12 మందిని నవంబర్ 12న రష్యా రాజధాని మాస్కోకు పంపాడు.

రష్యా చేరుకున్నాక అసలు కథ మైదలైంది. మాస్కోలో విమానం దిగిన తర్వాత రష్యన్ భాషలో రాసిన అగ్రిమెంట్లపై వారితో సంతకాలు చేయించుకున్నారు. ఆ తర్వాత వారి రక్షణ కోసమంటూ ఆయుధాలు ఇచ్చి బలవంతంగా ట్రైనింగ్ ప్రారంభించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు వారందరినీ ఉక్రెయిన్ కు పంపించారు. గతేడాది డిసెంబర్ 31 వరకు కుటుంబసభ్యులతో వారంతా కాంటాక్ట్లో ఉన్నారు. అయితే ఉక్రెయిన్ చేరుకున్న తర్వాత వారి నుంచి ఎలాంటి సమాచారం లేదు. దీంతో తన అస్ఫాన్ ఏమైపోయాడో తెలియకు ఆయన భార్య, సోదరుడు ఆందోళన చెందుతున్నారు.

జనవరి 23న కాల్పుల్లో ఓ యువకుడు గాయపడడంతో రష్యా సైన్యంలో భారతీయులున్న విషయం బయట ప్రపంచానికి తెలిసింది. గాయపడిన యువకుడిని హెల్త్ క్యాంపునకు తీసుకెళ్లడంతో అక్కడి నుంచి కుటుంబ సభ్యులతో ఫోన్ మాట్లాడి అసలు విషయం చెప్పాడు. దీంతో అస్ఫాన్ సహా 182మందితో రష్యా ఆర్మీ బలవంతంగా పనిచేయిస్తున్న విషయం బయటపడింది. దీంతో అస్ఫాన్ కుటుంబసభ్యులు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీని కలిశారు. ఆయన సాయంతో విదేశీ వ్యవహారాల శాఖను, మాస్కోలోని ఇండియన్ ఎంబసీని సంప్రదించారు. ప్రధాని మోడీకి సైతం లేఖ రాశారు. నెల రోజులు దాటినా కేంద్రం నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో బాధిత కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం ఇప్పటికైనా స్పందించి తమ వారిని సురక్షితంగా భారత్ తీసుకురావాలని కోరుతున్నారు.

Updated : 22 Feb 2024 11:17 AM GMT
Tags:    
Next Story
Share it
Top