డీకే అరుణ సంచలన నిర్ణయం.. ఈ ఎన్నికల్లో..
X
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. తన నియోజకవర్గమైన గద్వాల్లో బీసీ అభ్యర్థికి అవకాశం కల్పిస్తామన్నారు. తమ పార్టీ బీసీ ముఖ్యమంత్రి నినాదంతో ముందుకు సాగుతోందని, అందుకే తన స్థానంలో బీసీకి అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
అయితే రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తామని స్పష్టం చేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సహా ఎంపీ లక్ష్మణ్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఈ లిస్ట్లో డీకే అరుణ చేరింది. అయితే ఆమె సడెన్ నిర్ణయం వెనుక కారణమేంటన్నది ఆసక్తిగా మారింది. డీకే అరుణ ఎన్నికల బరిలో లేకపోవడంతో బీజేపీ నుంచి ఎవరు బరిలోకి దిగుతారనే చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి జడ్పీ చైర్ పర్సన్ తిరుపతయ్య పోటీ చేస్తున్నారు.