Revanth Reddy : ప్రభుత్వ పాఠశాలలో చదివి ఈ స్థాయికి ఎదిగాను.. సీఎం రేవంత్ రెడ్డి
X
గుంటూరు, గుడివాడలో చదువుకున్న వారు నాకు ఇంగ్లీష్ రాదంటూ అవహేళన చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ఎల్భీ స్టేడియంలో ఉద్యోగ నియామక పత్రాలు పంపిణీ చేశారు. గురుకుల స్కూల్స్ లో టీజీటీ, పీజీటీ జాబ్‌లకు ఎంపిక వారికి అపాయింట్ మెంట్ లేటర్లు అందించారు. 5,192 టీచర్లు, లెక్చరర్లు ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు ఇచ్చారు.
2023 డిసెంబర్‌లో ఇదే ఎల్భీ స్టేడియంలో ఇందిరమ్మ రాజ్యం పాలనలో ప్రజాపాలన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆరు గ్యారెంటీల అమలుకు ఇక్కడే తొలి సంతకం పెట్టమని సీఎం అన్నారు. మూడు నెలల్లో 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలను ఇచ్చిమని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట సాధన కోసం యువత, నిరుద్యోగులు ముందుండి పోరాడి త్యాగాలు చేశారని సీఎం అన్నారు. త్యాగాలతోనైనా జాబ్‌లు వస్తాయని కొందరు విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారని రేవంత్ స్పష్టం చేశారు. యువత డ్రగ్స్, గంజాయి వైపు వెళుతున్నారని విలువైన జీవించేలా సామాజిక బాధ్యతను అలవరుచుకోవాలని ఆయన అన్నారు.