Home > తెలంగాణ > నా భార్య నరకం చూపిస్తోంది.. ఐఏఎస్‌ అధికారి ఫిర్యాదు

నా భార్య నరకం చూపిస్తోంది.. ఐఏఎస్‌ అధికారి ఫిర్యాదు

నా భార్య నరకం చూపిస్తోంది.. ఐఏఎస్‌ అధికారి ఫిర్యాదు
X

భర్త వేధింపులు తాళలేక మనస్తాపానికి గురయ్యే మహిళలున్న దేశంలోనే... భార్య పెట్టే టార్చర్ తట్టుకోలేక జీవితాన్ని అర్థాంతరంగా ముగించే మగాళ్లూ ఉన్నారు. చట్టాలను తమకు అనుకూలంగా మార్చుకొని.. భర్తలను సాధిస్తున్న భార్యలను తరచూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం. సామాన్యులే కాదు.. ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నవారూ సైతం ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా తన భార్య తరఫు కుటుంబ సభ్యుల వేధింపులతో నరకం చవిచూశానంటూ ఐఏఎస్‌ అధికారి పీఎస్ లో కంప్లైంట్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

సందీప్‌కుమార్‌ ఝా అనే ఐఏఎస్‌ అధికారి తాజాగా తన భార్య, మామ, బామ్మర్ది పై బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భార్య, మామ, బామ్మర్ది తనను మానసికంగా, భౌతికంగా ఇబ్బందులకు గురిచేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన పేరిట ఉన్న ఆస్తులను బదలాయించాంటూ ఒత్తిడి తెచ్చారని, గృహహింస, వరకట్న కేసులు నమోదు చేస్తామంటూ భార్య బెదిరించారని తెలిపారు. ఈ మేరకు ముగ్గురిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే, భార్య పల్లవి తన భర్త అసహజ శృంగారానికి పాల్పడుతున్నారని, వరకట్న వేధింపులకు గురిచేస్తున్నారని ఛత్తీస్‌గఢ్‌లో ఫిర్యాదు చేయడంతో అక్కడి న్యాయస్థానం సూచనల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

తెలంగాణ క్యాడర్‌కు చెందిన 2014 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ ఝా స్వస్థలం బీహార్‌లోని దర్భంగా జిల్లా. ఆయన 2021 నవంబర్ లో కోర్బా ప్రాంతానికి చెందిన యువతిని వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో కట్నకానుకల కోసం అమ్మాయి తల్లిదండ్రులు కోటి రూపాయలకు పైగా ఖర్చు చేశారు. ఈ ఏడాది జూన్ నెలలో ఆమె భర్తపై పలు ఆరోపణలు చేశారు. గృహ హింసతోపాటు, వివాహం తర్వాతి నుంచి అదనపు కట్నం తీసుకురావాలని వేధించేవారని కోర్బా ఎస్పీకి ఆమె ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోకపోవడంతో చత్తీస్‌గఢ్‌లోని కోర్బా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సందీప్ కుమార్ ఝాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

సందీప్ కుమార్ ప్రస్తుతం తెలంగాణ ఐటీ శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. భార్య తనపై ఫిర్యాదు చేయడంతో అక్కడి న్యాయస్థానం సూచనల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో సందీప్ కుమార్ తన భార్యతో ఇబ్బందులు పడుతున్నానని హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేశాడు.





Updated : 7 Aug 2023 12:25 PM IST
Tags:    
Next Story
Share it
Top