Home > తెలంగాణ > IAS Transfer : తెలంగాణలో ఐఏఎస్ల బదిలీలు.. పలువురికి కీలక బాధ్యతలు

IAS Transfer : తెలంగాణలో ఐఏఎస్ల బదిలీలు.. పలువురికి కీలక బాధ్యతలు

IAS Transfer : తెలంగాణలో ఐఏఎస్ల బదిలీలు.. పలువురికి కీలక బాధ్యతలు
X

తెలంగాణలో ఐఏఎస్ బదిలీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురిని బదిలీ చేసిన రేవంత్ సర్కార్.. తాజాగా మరో 9 ఐఏఎస్, ఒక ఐఎఫ్ఎస్ను బదిలీ చేసింది. ఎస్సీ గురుకుల, విద్యాలయాల కార్యదర్శిగా ఉన్న నవీన్ నికోలస్ను టీఎస్పీఎస్పీ కార్యదర్శిగా బదిలీ చేశారు. గతంలో నవీన్ గురుకుల నియామక బోర్డు కన్వీనర్ గా పనిచేశారు. గురుకుల విద్యాలయాల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అనుభవం ఉన్న ఆయనకు టీఎస్పీఎస్సీ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించారు. టీఎస్పీఎస్సీ కార్యదర్శిగా ఉన్న అనితా రామచంద్రన్ ను పంచాయతీ రాజ్ కమిషనర్గా బదిలీ అయ్యారు.

రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్‌ గా ఉన్న హనుమంతరావును రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాల శాఖ కమిషనర్గా నియమించింది. సమాచార శాఖ కమిషనర్గా ఉన్న అశోక్ రెడ్డిని హార్టికల్చర్ డైరెక్టర్ బాధ్యతలు అప్పగించింది. వ్యవసాయ శాఖ కమిషనర్గా ఉన్న గోపిని.. మత్స్యశాఖ కమిషనర్ గా, చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ గా ఉన్న బాలమాయాదేవిని బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ గా నియమించిది. ఐఏఎస్ లుగా పదోన్నతి పొంది వెయింటింగ్ లో ఉన్న సీతాలక్ష్మి, ఫణీంద్రరెడ్డిలకు పోస్టింగులు ఇచ్చింది. సీతాలక్ష్మీని ఎస్సీ గురుకుల విద్యాలయాల కార్యదర్శిగా, ఫణీంద్రరెడ్డిని చీఫ్ రేషనింగ్ ఆఫీసర్గా నియమించింది. క్రైస్తవ మైనార్టీ ఎండీగా ఉన్న నిర్మలకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్,

జూపార్కుల డైరెక్టర్గా ఉన్న వీఎస్ఎన్వీ ప్రసాద్ ను పౌరసరఫరాల డైరెక్టర్ బాధ్యతలు అప్పగించింది.

Updated : 5 Feb 2024 7:11 AM IST
Tags:    
Next Story
Share it
Top