Home > తెలంగాణ > TSRTC BUS : మగాళ్ల బస్సు రద్దు.. మూడు రోజుల ముచ్చటగా స్పెషల్ బస్సు..

TSRTC BUS : మగాళ్ల బస్సు రద్దు.. మూడు రోజుల ముచ్చటగా స్పెషల్ బస్సు..

TSRTC BUS : మగాళ్ల బస్సు రద్దు.. మూడు రోజుల ముచ్చటగా స్పెషల్ బస్సు..
X

తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ స్కీం విజయవంతంగా కొనసాగుతోంది. ఫ్రీ జర్నీతో ఎక్స్ప్రెస్, పల్లెవెలుగు బస్సుల్లో మహిళల రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో మగవారికి సీట్లు దొరకడం కష్టంగా మారింది. పలువురు పురుషులు ప్రభుత్వంపై విమర్శలకు దిగుతున్నారు. ఈ స్కీం అటు ఆర్టీసీపైనా ఒత్తిడిని పెంచుతోంది. ఈ క్రమంలో టీఎస్ఆర్టీసీ సరికొత్త ప్రయోగం చేసింది. మగవారి కోసం స్పెషల్ బస్సు సర్వీస్ ను అందుబాటులోకి తెచ్చింది. అయితే ఇది మూణ్నాళ్ల ముచ్చటగా మారింది.

ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణంతో సీట్లు దొరక్క మగవారికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అలాగని ఆడవాళ్లని బస్సు ఎక్కొద్దని చెప్పలేరు. దీంతో ఇబ్రహీంపట్నం బస్‌డిపో ‘పురుషులకు ప్రత్యేకం’ బస్సును ప్రవేశపెట్టింది. ఇబ్రహీంపట్నం - ఎల్బీనగర్‌ మధ్య దీనిని అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజులు మాత్రమే దీనిని నడించారు. గురువారం నుంచి ఈ స్పెషల్ బస్సు సర్వీసును రద్దు చేసినట్లు డిపో మేనేజర్‌ స్పష్టం చేశారు.

ఇబ్రహీంపట్నం - ఎల్బీనగర్‌ రూట్లో నిత్యం బస్సులు తిరుగుతూనే ఉంటాయి. స్పెషల్ బస్సు దాన్ని టైమింగ్ను బట్టి వస్తుంది. అప్పటివరకు మగవాళ్లు ఆగడం కష్టం. ఏదో ఒక బస్సు వెళ్తారు. దీంతో బస్సు సర్వీస్ను రద్దు చేసినట్లు డిపో మేనేజర్ తెలిపారు. ప్రస్తుతం ‘పురుషులకు మాత్రమే’ బస్సు ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరోవైపు ఆర్టీసీ బస్సుల్లో మగవారికి రిజర్వ్ డ్ సీట్లు కేటాయించే అంశాన్ని టీఎస్ఆర్టీసీ పరిశీలిస్తోంది. ప్రతీ బస్సులోనూ మొత్తం 55 సీట్లలో 20 సీట్లు రిజర్వ్ చేస్తే ఎలా ఉంటుందనే దానిపై అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. ఈ మేరకు డిపో మేనేజర్ల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు.

ఒకవేళ మగవారికి రిజర్వ్డ్ సీట్లు కేటాయిస్తే.. ఆడవాళ్ల నుంచి వ్యతిరేకత వస్తుందా అనే కోణంలోనూ ఆర్టీసీ అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఆడవారికి తప్ప.. మగవారికి ఎక్కడా రిజర్వ్ డ్ సీట్లు కేటాయించలేదు. దీంతో ఈ అంశంపై ఆర్టీసీ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. అందరి అభిప్రాయాలు తెలుసకున్న తర్వాత మగవాళ్లకు రిజర్వుడు సీట్లపై నిర్ణయం తీసుకోవాలనే యోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.

Updated : 2 Feb 2024 10:06 AM IST
Tags:    
Next Story
Share it
Top