Transferring 12 SIs : 12 మంది ఎస్ఐల బదిలీ.. ఉత్తర్వులు జారీ చేసిన ఐజీ తరుణ్ జోషి
X
రామగుండం కమిషనరేట్ పరిధిలో పని చేస్తున్న 12 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ ఐజీ తరుణ్ జోషి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. కాళేశ్వరంలో పని చేస్తున్న లక్ష్మణ్ రావును పెద్దపల్లికి, పెద్దపల్లిలో పనిచేస్తున్న మహేందర్ ను ములుగు వీఆర్ కు, సుల్తానాబాద్ రెండవ ఎస్సైగా పని చేస్తున్న అశోక్ రెడ్డిని పోత్కపల్లికి, పొత్కపల్లిలో పనిచేస్తున్న శ్రీధర్ ను జూలపల్లికి, జూలపల్లిలో పనిచేస్తున్న వెంకట కృష్ణను రామగుండం వీఆర్ కు, ములుగు వీఆర్‌గా ఉన్న ఓంకార్ యాదవ్ ను కాల్వ శ్రీరాంపూర్ కు, కాల్వ శ్రీరాంపూర్ లో పనిచేస్తున్న శ్రీనివాసును రామగుండం వీఆర్ కు, తాండూరులో పనిచేస్తున్న రాజశేఖర్ ను మందమర్రి రెండవ ఎస్ఐగా, మంచిర్యాలలో పనిచేస్తున్న రాజేందర్ ను కోటపల్లికి, కోటపల్లిలో పనిచేస్తున్న సురేష్ ను రామగుండం వీఆర్ కు, కమాన్ పూర్ లో పనిచేస్తున్న రాములు ను భీమారంకు, భీమారం లో పనిచేస్తున్న రాజా వర్ధన్ ను రామగుండం వీఆర్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా రాష్ట్రంలోని పలు జిల్లా కమిషనరేట్ల పరిధుల్లో బదిలీలు జరుగుతున్నాయి. శనివారం సూర్యాపేట జిల్లా, శుక్రవారం జగిత్యాల జిల్లాల్లోనూ బదిలీలు జరిగాయి. జగిత్యాల జిల్లాలో వివిధ స్టేషన్ లో పనిచేస్తున్న 16 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ నార్త్ జోన్ ఐజి శుక్రవారం ఉత్తర్వులను వెలువరించారు. ఇక సూర్యాపేట జిల్లాలో పనిచేస్తున్న ఎస్‌ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ రాహుల్ హెగ్డే శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.