ఐఐటీ ఖరగ్పూర్లో దారుణం.. తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య
X
ఐఐటీ ఖరగ్పూర్లో దారుణం జరిగింది. చదువు ఒత్తిడి తట్టుకోలేక తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ కాకపోవడంతో మృతుడు బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
మెదక్ జిల్లా మాసాయిపేట మండలం సుజిత్ తండాకు చెందిన కేతావత్ కిరణ్ చంద్ర ఖరగ్పూర్ ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అయితే ప్రాజెక్ట్ వర్క్ పూర్తికాకపోవడంతో ఒత్తిడికి లోనైన కిరణ్ తానుంటున్న హాస్టల్లోనే ఉరేసుకుని బలవర్మరణానికి పాల్పడ్డారు. మంగళవారం రాత్రి 7.30గంటల సమయంలో కిరణ్ తన రూమ్ మేట్స్ తో కలిసి హాస్టల్ గదిలోనే ఉన్నాడు. ఆ తర్వాత ఇద్దరు పనిమీద బయటకు వెళ్లారు. రాత్రి 8.30గంటల సమయంలో వారు తిరిగి వచ్చే సరికి రూం లోపలి నుంచి లాక్ చేసి ఉంది. ఎంతసేపు కొట్టినా తలుపు తీయకపోవడంతో వారు బలవంతంగా డోర్ ఓపెన్ చేశారు.
తలుపులు తెరిచిన వారికి కిరణ్ చంద్ర ఉరేసుకొని కనిపించాడు. వెంటనే యాజమాన్యానికి సమాచారం ఇచ్చి హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు. అయితే అప్పటికే అతను చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. దీంతో స్నేహితులు కిరణ్ తండ్రికి సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకుని ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.