Home > తెలంగాణ > జింక, దుప్పి మాంసం కావాలా.. హైదరాబాద్‌కు రండి

జింక, దుప్పి మాంసం కావాలా.. హైదరాబాద్‌కు రండి

జింక, దుప్పి మాంసం కావాలా.. హైదరాబాద్‌కు రండి
X

'హైదరాబాద్ బాగా డెవలప్ అయింది.. ఏం కావాలన్నా ఇక్కడే దొరుకుతుంది..' అని మహేశ్ బాబు సినిమాలో ఓ పాపులర్ డైలాగ్. ఆ డైలాగ్ కాస్త నిజమనిపించేలా.. నగరంలో జింకలు, దుప్పి మాంసం దొరుకుతున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా ఓ ముఠా జింకలు, దుప్పుల మాంసాన్ని అక్రమంగా విక్రయిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలోని గగన్ పహాడ్ లో ఎస్ ఓటీ పోలీసులకు ఈ మేరకు సమాచారం అందడంతో ఐ సత్యనారాయణగౌడ్ ఆధ్వర్యంలో తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. ఈ తనిఖీలు చేపట్టగా.. షాకయ్యే నిజాలు తెలిశాయి.

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం సరస్వతీపురం గ్రామానికి చెందిన వెంకటేష్, కందుకూరు మండలం లేమూరు గ్రామానికి చెందిన కరుణాకర్, నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం యరగండ్లపల్లి గ్రామానికి చెందిన శ్రీను లు జింక, దుప్పుల మాంసాన్ని విక్రయిస్తున్నారు. ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి వారి నుంచి 16 కిలోల జింక, దుప్పుల మాంసాన్ని , రెండు బైక్‌లను స్వాధీనం చేసుకుని ఆర్‌జీఐఏ పోలీసులకు అప్పగించారు. అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణులను వేటాడి మాంసాన్ని నగర శివారులో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఆర్జీఐఏ పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.




Updated : 14 Aug 2023 1:12 PM IST
Tags:    
Next Story
Share it
Top