Home > తెలంగాణ > మూడు రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరిక

మూడు రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరిక

మూడు రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరిక
X

తెలంగాణలో వర్షాలపై వాతావరణశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం అధికారులు వెల్లడించారు. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షాల నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించారు. అంతేకాకుండా గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే చాన్స్ ఉందని పేర్కొంది. కాగా.. ఇవాళ హైదరాబాద్ సహా.. మహబూబ్‌నగర్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, జగిత్యాల, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, ఖమ్మం, నాగర్ కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, నారాయణపేట, వికారాబాద్ వనపర్తి, వరంగల్, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఇక బుధవారం (నవంబర్ 8) హైదరాబాద్‌లోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, అమీర్ పేట, కూకట్ పల్లి, ఖైరతాబాద్, చందానగర్, జూబ్లీహిల్స్, బంజారాహీల్స్, పంజాగుట్ట, యూసఫ్ గూడ, మియాపూర్, చింతల్, షాపూర్, హిమయాత్ నగర్, సికింద్రాబాద్, బోయినపల్లి, కుత్బుల్లాపూర్, సూరారం, సుచిత్ర, కొంపల్లి, కొంపల్లి, దూలపల్లి, మల్లంపేట్, జీడిమెట్ల, షాపూర్ నగర్, గాజులరామారం, గండిమైసమ్మ, బాహుదూర్ పల్లి లో వర్షం దంచి కొట్టింది. దీంతో ప్రధాన రహదారులన్నీ జలయమం అయ్యాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. వర్షపు నీటితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.




Updated : 9 Nov 2023 8:36 AM IST
Tags:    
Next Story
Share it
Top