Kg టమాటా రూ.180.. సోమవారం నుంచి మరింత పెరిగే ఛాన్స్..?
X
సామాన్య ప్రజలు ఇంట్లో ఏం వండుకొని తినాలన్నా భయపడే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో కూరగాయల రేట్లు మండిపోతున్న క్రమంలో.. వ్యాపారులు సిండికేట్ గా మారిపోయి ప్రజల జేబులకు చిల్లు పెడుతున్నారు. ఏ కూరగాయ చూసినా కిలో ర.50 తక్కువ లేదు. కొన్నైతే ఏకంగా వంద దాటేశాయి. టమాటా కొండెక్కిపోయి ఏకంగా రూ. 120 నుంచి రూ. 150 దాకా పలుకుతుంది. ఈ క్రమంలో ఆసిఫాబాద్ జిల్లాలో కొందరు చిరు వ్యాపారులు కిలో టమాటా రూ. 180కి అమ్ముతున్నారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ లో కిలో రూ.120 ఉంటే.. కాగజ్ నగర్ మున్సిపాలిటీలో రూ. 140గా ఉంది. ఇక గ్రామాల్లో వాటి రేట్లు మరింత పెంచి అమ్ముతున్నారు.
కౌటాల మండల కేంద్రంలో ఆదివారం కిలో టమాటా రూ. 180కి విక్రయించారు. సోమవారం నుంచి ధరలు మరింత పెరిగే ఛాన్స్ ఉందని వ్యాపారులు చెప్తున్నారు. ఒక వైపు ధరలు పెరిగి సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతుంటే.. వాటి నియంత్రణపై మార్కెటింగ్ శాఖ ఇంకా దృష్టి పెట్టడం లేదు. ఒకవైపు రోజురోజుకు ధరలు పెరుగుతున్నా.. మరోవైపు రైతులకు గిట్టుబాటు ధర లభించడంలేదు. ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలం అవుతుంది. ఈ క్రమంలో కూరగాయల ధరలు పెరగడంలో సిండికేట్లు కారణమని కొందరు అంటున్నారు. రైతుల దగ్గరనుంచి తక్కువ ధరకు కొని.. జనాలకు ఎక్కువ ధరకు అమ్ముతున్నారని ఆరోపిస్తున్నారు.