Home > తెలంగాణ > కడెంలో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్, ఎమ్మెల్యేల‌కు నిర‌స‌న సెగ‌

కడెంలో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్, ఎమ్మెల్యేల‌కు నిర‌స‌న సెగ‌

కడెంలో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్, ఎమ్మెల్యేల‌కు నిర‌స‌న సెగ‌
X

నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన రాష్ట్ర న్యాయ ఆటవి దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రేఖ నాయక్ కు నిరసన సెగ తగలింది. కడెం ప్రాజెక్ట్ ప్రస్తుత దుస్థితికి ప్రధాన కారణం అధికార పార్టీ ప్రజా ప్రతినిధులేనంటూ వారికి వ్యతిరేకంగా కడెం మండల కేంద్రంలో గురువారం ఉదయం కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో స్థానిక ప్రజలు ఆందోళన చేపట్టారు. కడెం కు వ‌చ్చిన‌ఎమ్మెల్యే , మంత్రి కాన్వాయ్ అడ్డగించారు. గత సంవత్సరం జరిగిన ప్రమాదకర పరిస్థితిని ద్రుష్టిలో పెట్టుకోకపోవడంతో ఈ సంవత్సరం కూడా ప్రాజెక్ట్ కొట్టుకుపోయే పరిస్థితి వచ్చిందని ప్రజలు ఆందోళన చేపట్టారు. పోలీసులు భారీ బందోబస్తు మధ్య మంత్రి కాన్వాయ్ ని ప్రాజెక్టు వద్దకు తీసుకు వెళ్లారు. అడ్డుకున్న ప‌లువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. ఈ సంద‌ర్బంగా కొద్దిసేపు తోపులాట చోటు చేసుకుంది.

సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ నాయకులు పొద్దుటూరు సతీష్ రెడ్డి , స్థానిక ప్రజలు.. ఐ.కే. రెడ్డి డౌన్ డౌన్, మంత్రి గో బ్యాక్... నినాదాలు చేశారు. కడం ప్రాజెక్ట్ కు వస్తున్న వరద ప్రమాదంపై, మొరాస్తున్న కడెం ప్రాజెక్టు వరద గేట్ల మరమ్మతులకు అభివృద్ధికి పట్టించుకోకపోవడంపై ప్రశ్నించారు. దీంతో మంత్రి ఐ. కే రెడ్డిని ప్రశ్నించిన సతీష్ రెడ్డిని కడం పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కుతరలించారు

కడెం ప్రాజెక్టును గురువారం ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీర రేఖ నాయక్, నిర్మల్ జిల్లా కలెక్టర్ కే వరుణ్ రెడ్డి, జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ తో కలిసి రాష్ట్ర న్యాయ ఆటవి దేవాదాయ శాఖ మంత్రివర్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సందర్శించారు ఈ సందర్భంగా కడెం ప్రాజెక్టు నీటిమట్టం ప్రస్తుతం కడెం జలాశయంలో వస్తున్న ఇన్ ఫ్లో వరద నీరు వరద గేట్ల పరిస్థితి పై నీటిపారుదల శాఖ అధికారులకు అడిగి తెలుసుకున్నారు . కడెం ప్రాజెక్టు వరదగేట్ల పై నుండి ప్రవహిస్తున్న వరద నీరు లోతట్టు గ్రామాల ప్రజల తరలింపు ప్రాజెక్టుకు వరద ముప్పు ఏర్పడితే తీసుకోవాల్సిన చర్యలపై పలు శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు.



Updated : 27 July 2023 7:25 AM GMT
Tags:    
Next Story
Share it
Top