పండ్ల లారీ బోల్తా.. ఎగబడిన జనం
Mic Tv Desk | 3 Jan 2024 5:29 PM IST
X
X
నారింజ పండ్ల లోడ్ తో వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి కిందపడటంతో పండ్లన్నీ కిందపడ్డాయి. దీంతో అటుగా వెళ్తున్న వాళ్లంతా పండ్ల కోసం ఎగబడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న నారింజ పండ్ల లారీ ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుష్టి వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీలోని నారింజ పండ్లన్నీ కిందపడ్డాయి.
దీంతో స్థానికులు పండ్ల కోసం ఎగబడ్డారు. దొరికినోళ్లకు దొరికినంతా అన్నట్లు పండ్లను సంచులు, ప్లాస్టిక్ కవర్లలో నింపుకుని తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు "ఫలాలు ఒకరివి.. పలహారం ఇంకొకరిది" అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.
Updated : 3 Jan 2024 5:29 PM IST
Tags: lorry load oranges fruits Nagpur Hyderabad Kushti Neradigonda Adilabad distric bags plastic covers
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire