ఎన్నికలు ఎప్పుడొచ్చినా కేసీఆర్కే ప్రజలు పట్టం కడతారు: Harish Rao
X
రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. జనగామలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో మాట్లాడిన ఆయన.. రేవంత్ వ్యాఖ్యలు రాష్ట్రం పరువు తీసేలా ఉన్నాయని మండిపడ్డారు. ఎన్నికలు ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. తెలంగాణ ప్రజలు కేసీఆర్ కే పట్టం కడతారని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. కేసీఆర్ కు జనగామ అంటే అమితమైన ప్రేమ అని అన్నారు. ఎప్పుడూ ఈ ప్రాంతం గురించే ప్రస్తావన తెస్తుంటారని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. ఎప్పుడూ ప్రజల పక్షణ నిలబడి పోరాడుతుందని హరీశ్ రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారం చేపట్టి నేటికి 60 రోజులు పూర్తవుతున్నా.. ఇచ్చిన హామీలను పట్టించేకోలేదని అన్నారు.
రుణమాఫీ, పింఛన్ ఇస్తామని చెప్పి.. ఇప్పటికీ ఆ హామీలను పట్టించుకోలేదని, రైతు బంధు ఊసేలేదని మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగ భృతిపై డిప్యూటీ సీఎం భట్టిని నిలదీస్తే సమాధానం లేదని అన్నారు. గ్రామాల్లో కరెంట్ కోతలు విధిస్తుందని ఆరోపించారు. రెండు నెలల్లో కాంగ్రెస్ పార్టీ నాలుగు మోసాలు చేసిందని ఫైర్ అయ్యారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్కు గుణపాఠం చెప్పామనని ధీమా వ్యక్తం చేశారు.